News February 28, 2025
కోనసీమ: ‘జాతీయ లోక్ అదాలత్ జయప్రదం చేయాలి’

రామచంద్రపురం పట్టణంలో గురువారం అదనపు జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులతో రామచంద్రపురం 13వ అదనపు జిల్లా సెషన్స్ కోర్ట్ జడ్జి ఎన్. శంకరరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 8 న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను జయప్రదం చేయాలని పేర్కొన్నారు. గతంలో రామచంద్రపురం నుంచి ఎక్కువ సంఖ్యలో లోక్ అదాలత్‌కు కేసులు వచ్చేలా న్యాయవాదులు సహకరించారని అన్నారు. ఆ పరంపర కొనసాగాలన్నారు.
Similar News
News March 23, 2025
రోడ్డు ప్రమాదంలో హిందీ టీచర్ స్పాట్ డెడ్

తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం చిట్టటూరు హరిజనవాడ వద్ద శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైకు మీద వెళ్తున్న కమ్మపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న హిందీ టీచర్ శివకేశవులు(45)ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు వాహన దారులు 108కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వెంటనే డెడ్ బాడీని వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
News March 23, 2025
యానాం సబ్ జైలు గోడదూకి పరారైన ఖైదీ

కేంద్రపాలిత ప్రాంతమైన యానాం సబ్ జైల్ నుంచి గోడ దూకి ఓ ఖైదీ పరారయ్యాడు. సుమారు 25 అడుగులు సబ్ జైల్ గోడ పైనుంచి దూకి శనివారం పరారైనట్లు సమాచారం. ఒక దొంగతనం కేసులో శనివారం ఉదయం 7 రోజులు రిమాండ్ ఖైదీగా జైలుకి వెళ్లిన కనకాల పేటకు చెందిన కనకాల వెంకటేశ్వర్లు మధ్యాహ్నానికి పరారయ్యాడని చెబుతున్నారు. పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
News March 23, 2025
విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తాం: మంత్రి

నేటికి పిల్లలు నేల మీద కూర్చుని చదవటం బాధాకరమని మంత్రి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే అన్ని పాఠశాలలో బల్లలు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు శనివారం సాయంత్రం నెల్లూరు నగరంలోని పలు మున్సిపల్ పాఠశాలలను ఆయన పరిశీలించారు. వైకుంఠపురంలోని అంగన్వాడి కేంద్రాన్ని మరో భవనంలోకి తరలించాలని మంత్రి ఆదేశించారు. త్వరలోనే విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.