News April 10, 2025
కోనసీమ జిల్లాకు వాతావరణ శాఖ హెచ్చరిక

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గురువారం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన మొదలైంది. రెండు రోజుల నుంచి వాతావరణంలో ఏర్పడిన మార్పులు రైతులను కలవర పాటుకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే ప్రతికూల వాతావరణంతో రైతుల్లో గుబులు మొదలైంది.
Similar News
News October 14, 2025
ఆకివీడు: రైలు నుంచి జారిపడి వృద్ధుడు మృతి

ఆకివీడు – పల్లెవాడ రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం గుర్తు తెలియని వృద్ధుడు (సుమారు 60 సం.) రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. మృతుడిని గుర్తించిన వారు లేదా వివరాలు తెలిసిన వారు రైటర్ రాజాబాబు (9705649492) కి తెలపాలని జీఆర్పీఎఫ్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 14, 2025
గుంటూరు: వ్యభిచార గృహంపై దాడి

జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం విశ్వసనీయ సమాచారం ఆధారంగా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాష్ నగర్ ప్రాంతంలో ఉన్న ఒక ఇంటిపై ఆకస్మిక దాడి నిర్వహించింది. దాడిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించి ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని, పోలీసులు ఈ దిశగా అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు.
News October 14, 2025
పక్కదారి పడుతున్న PM కిసాన్ నిధులు

PM కిసాన్ నిధులు పక్కదారి పడుతున్నట్లు కేంద్రం గుర్తించింది. నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒకరికే నిధులు అందాలి. కానీ, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం భార్యాభర్తలు ఇద్దరికీ, భూమి పూర్వపు యజమానికి కూడా నిధులు జమవుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. మొత్తం 31 లక్షల కేసులను గుర్తించగా రాష్ట్రాలు 19.02 లక్షల కేసులను పరిశీలించాయి. వాటిలో 17.87 లక్షల మంది దంపతులు ఇద్దరూ నిధులు పొందుతున్నట్లు తేలింది.