News March 6, 2025
‘కోనసీమ జిల్లాను కోకో హబ్‌గా తిర్చుదిద్దుతాం’

కోనసీమ జిల్లాను కోకో హబ్ గా తీర్చిదిద్దేందుకు కోనసీమ కోకో సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. బుధవారం అమలాపురం కలెక్టరేట్లో ఉద్యాన సహకార రిజిస్టార్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కోనసీమ కోకో సంఘం ఏర్పాటు విధి విధానాలపై సమాలోచనలు జరిపారు. ఈ సంఘంలో అధ్యక్షుడిగా జిల్లా జాయింట్ కలెక్టర్, ఉపాధ్యక్షుడిగా జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఉంటారన్నారు.
Similar News
News November 23, 2025
MHBD జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు

MHBD, తొర్రూర్ డివిజన్ పరిధిలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫేస్-1 ఎన్నికల్లో గూడూరు, ఇనుగుర్తి, కేసముద్రం, MHBD, నెల్లికుదురు, 2వ విడతలో బయ్యారం, చిన్నగూడూరు, దంతాలపల్లి, గార్ల, నర్సింహులపేట, పెద్దవంగర, తొర్రూరు, థర్ద్ ఫేస్‌లో డోర్నకల్, గంగారాం, కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరోల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వుల్లో వెల్లడించారు.
News November 23, 2025
మీకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌లో ఖాతా ఉందా?

AP: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. ఖాతాదారుల సౌకర్యార్థం కొత్తగా IFSC కోడ్ UBIN0CG7999ను ఏర్పాటుచేసినట్లు తెలిపింది. దీనిద్వారానే NEFT/RTGS/IMPS/UPI సేవలను కొనసాగించుకోవచ్చని తెలిపింది. కాగా ఈ ఏడాది మే 1 నుంచి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, గ్రామీణ వికాస్ బ్యాంక్, సప్తగిరి బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులు విలీనమై ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా అవతరించిన విషయం తెలిసిందే.
News November 23, 2025
భీమ్‌గల్: 11 ఎకరాలను విరాళంగా ఇచ్చిన మహేశ్ గౌడ్

TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తన సొంత గ్రామమైన రహత్ నగర్‌పై దాతృత్వం చాటుకున్నారు. గ్రామాభివృద్ధి కోసం తన 11 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు 10 ఎకరాలు, సబ్‌స్టేషన్‌కు 1 ఎకరాన్ని అందజేసి గ్రామ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.50 లక్షలతో నిర్మిస్తున్న దుర్గాదేవి నూతన ఆలయ భూమి పూజలో ఆయన పాల్గొన్నారు.


