News May 2, 2024
కోనసీమ జిల్లాలో ఎన్నికలపై 592 ఫిర్యాదులు
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై సి.విజిల్ యాప్ ద్వారా 592 ఫిర్యాదులు అందాయని సి.విజిల్ యాప్ నోడల్ అధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. 100 నిమిషాల లోపు 436 ఫిర్యాదులు పరిష్కరించామన్నారు. 118 ఫిర్యాదులు ఎన్నికలకు సంబంధించినవి కావని చెప్పారు. 38 ఫిర్యాదులను వంద నిమిషాలు తర్వాత పరిష్కరించడం జరిగిందన్నారు. ఎన్నికల సంఘానికి 44 ఫిర్యాదులు అందగా 33 పరిష్కరించామన్నారు.
Similar News
News November 24, 2024
కోనసీమ వాసికి అవార్డు అందించిన సినీ నటి కీర్తి సురేశ్
ఉమ్మడి తూ.గో.జిల్లా పి.గన్నవరంలో రెండున్నర దశాబ్దాల నుంచి మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీగా సభ్యులకు సేవలు అందిస్తున్నందుకు ధనవర్ష సొసైటీకి ప్రముఖ సినీనటి కీర్తి సురేశ్ అవార్డు అందించారు. హైదరాబాదులోని తాజ్ కృష్ణ హోటల్లో శనివారం జరిగిన సమావేశంలో అవార్డు అందించారని సంగం ఛైర్మన్ కంకిపాటి ప్రసాద్ ఆదివారం తెలిపారు.
News November 24, 2024
గోకవరం: బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి
బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి చెందిన విషాదకర ఘటన గోకవరం ప్రభుత్వాసుపత్రిలో జరిగింది. రాజవొమ్మంగి మండలం కొండపల్లికి చెందిన వెంకటలక్ష్మి గోకవరం ఫారెస్ట్ చెక్‌పోస్ట్‌లో పని చేస్తున్నారు. ప్రసవం నిమిత్తం ఆపరేషన్ చేస్తుండగా ఉమ్మనీరు రక్తనాళాల్లోకి వెళ్లి గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నవమాసాలు మోసి ఆ తల్లి బిడ్డను చూడకుండానే మృతి చెందడం కలిచివేసింది.
News November 24, 2024
కాకినాడ: టీచర్‌ను కొట్టుకుంటూ తీసుకెళ్లారు
కాకినాడలోని ఓ మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్‌ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించేందుకు పాఠశాలకు వచ్చిన మహిళా పోలీసులకు తమ ఒంటిపై చేతులు వేసి టీచర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు టీచర్‌కు దేహశుద్ధి చేశారు. పోలీసులు వారికి సర్దిచెప్పి ఉపాధ్యాయుడిని పీఎస్‌కు తరలించారు.