News February 16, 2025
కోనసీమ జిల్లాలో ఒక్క కేసు కూడా లేదు : కలెక్టర్

కోనసీమ జిల్లాలో మాత్రం ఒక్క బర్డ్ ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలో 52 కమర్షియల్ పౌల్ట్రీల్లో 24 లక్షల కోళ్లు ఉన్నాయని, 10 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇతర జిల్లాల్లోని కోళ్ల ఉత్పత్తులు రానీయకుండా అరికట్టామన్నారు. ఇక్కడి మాంసం విక్రయదారులపై ఆంక్షలు విధించవద్దన్నారు. అంగన్వాడీ, పాఠశాలల్లో గుడ్లను బాగా ఉడికించి అందించాలని ఆదేశించారు.
Similar News
News March 19, 2025
అన్నమయ్య: భార్య గర్భిణి.. ప్రేయసితో భర్త జంప్

భార్యను మోసం చేసి భర్త మరో యువతితో వెళ్లిపోయిన ఉదంతంపై మంగళవారం రాత్రి బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. కొత్తకోటకు చెందిన డ్రైవర్ అనిల్ ములకలచెరువు మండలానికి చెందిన 21ఏళ్ల యువతితో గతేడాది ఆగస్టులో వివాహమైంది. ప్రస్తుతం 6నెలల గర్భిణి. అయితే స్థానికంగా ఉండే యువతి మాయలో పడి గర్భంతో ఉన్న భార్యను వదిలేసి ప్రియురాలితో జంప్ అయ్యాడు. భార్య ఫిర్యాదుపై కేసు నమోదు అయింది.
News March 19, 2025
ఏలూరు హైవేపై కారును ఢీకొన్న లారీ

ఏలూరు జాతీయ రహదారిలోని ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో మంగళవారం అర్ధరాత్రి కారును లారీ ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులలో ఇద్దరు గాయపడ్డారు. లారీతో సహా డ్రైవర్ పరారయ్యాడు. గుంటూరులోని ఓ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వ్యక్తిని తాడేపల్లిగూడెం తరలిస్తుండగా మార్గమధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై విచారిస్తున్నారు.
News March 19, 2025
కోడూరు బీచ్‌లో షూటింగ్ సందడి..!

తోటపల్లి గూడూరు మండలం కోడూరు బీచ్ తీరంలోని వేళాంగిణి మాత ఆలయం పరిసర ప్రాంతాలలో సినిమా షూటింగ్ సందడి నెలకొంది. చిత్ర యూనిట్ భక్తి సంబంధమైన “అసుర సంహారం” సినిమా చిత్రీకరణ చేపట్టారు. ఈ చిత్రంలో ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణి ముఖ్య పాత్ర పోషిస్తున్నారని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. చిత్రం నిర్వాహకులు మాట్లాడుతూ”అసుర సంహారం” ప్రధాన ఘట్టాలు నెల్లూరు జిల్లాలో చిత్రీకరిస్తున్నారన్నారు.