News March 1, 2025
కోనసీమ జిల్లాలో నేటి నుంచి కొత్త రూల్స్

నేటి నుంచి న్యూ సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ అమల్లోకి రానుందని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ బి. క్రిష్ణారావు తెలిపారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ. 1000, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే రూ.5 వేలు, మద్యం తాగి, సెల్‌ఫోన్ పట్టుకుని వాహనం నడిపితే రూ.10వేలు, నంబర్ ప్లేట్ సరిగ్గా లేకుంటే రూ.2వేలు జరిమానా విధిస్తామన్నారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించి సహకరించాలని కోరారు.
Similar News
News December 6, 2025
విశాఖ: అవినీతిపై ప్రశ్నించిన GVMC స్థాయి సంఘం

GVMC స్థాయి సంఘం ఛైర్మన్ శ్రీనివాస్ రావు అధ్యక్షతన శనివారం సమావేశం నిర్వహించారు. 287 అంశాలపై చర్చించగా, అవినీతికి ఆస్కారం ఉన్న 34 ప్రధాన అంశాలపై సభ్యులు, ఛైర్మన్ అభ్యంతరాలు లేవనెత్తారు. అధికారులు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో ఆ అంశాలను వాయిదా వేశారు. యోగాంధ్ర నిర్వహణలో బీచ్ రోడ్డులో రంగుల ఖర్చులపై విచారణ చేపట్టాలని ఛైర్మన్ ఆదేశించారు. హెలిప్యాడ్ రాళ్ల తొలగింపు తదితర ఖర్చుల అంశాలను వాయిదా వేశారు.
News December 6, 2025
అభిషేక్ ఊచకోత.. ఈ ఏడాది 100 సిక్సర్లు

విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. టీ20ల్లో ఒకే క్యాలండర్ ఇయర్లో 100 సిక్సర్లు(36 ఇన్నింగ్స్‌లు) బాదిన తొలి ఇండియన్‌గా నిలిచారు. ఇవాళ SMATలో సర్వీసెస్‌తో మ్యాచులో పంజాబ్ తరఫున ఆడిన అభిషేక్ 3 సిక్సర్లు బాది ఈ ఫీట్‌ను అందుకున్నారు. ఓవరాల్‌గా నికోలస్ పూరన్ గతేడాది 170 సిక్సర్లు బాదారు. ఇక ఈ ఏడాది T20ల్లో అభి 1,499 రన్స్ చేయగా వాటిలో 3 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.
News December 6, 2025
ఎన్నికలు ముగిసే వరకు కోడ్ అమలు: కలెక్టర్ ప్రావీణ్య

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మూడు దశల ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి(కోడ్) అమలులో ఉంటుందని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య శనివారం స్పష్టం చేశారు. మొదటి, రెండో విడత ఎన్నికలు పూర్తయిన గ్రామాల్లో సైతం చివరి దశ ఎన్నికలు పూర్తయ్యే వరకు కోడ్ అమల్లో ఉంటుందని చెప్పారు. ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


