News April 11, 2025
కోనసీమ జిల్లాలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడి పర్యటన

కోనసీమ జిల్లాలో రెండవ రోజు గురువారం రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు జక్కంపూడి కిరణ్ పర్యటించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జాయింట్ కలెక్టర్ నిశాంతి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల పనితీరు గురించి సమీక్షించారు. రెండు రోజుల కోనసీమ జిల్లా పర్యటనలో తాను శాఖల వారిగా గుర్తించిన లోపాలను సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారుల దృష్టికి ఆయన తీసుకువచ్చారన్నారు.
Similar News
News April 23, 2025
సివిల్స్‌లో వెల్దండ యశ్వంత్‌కు 432వ ర్యాంకు

వెల్దండ మండలం పోచమ్మగడ్డ తండాకు చెందిన యశ్వంత్ నాయక్ సివిల్స్ ఫలితాల్లో 432వ ర్యాంకు సాధించాడు. గత సంవత్సరం సివిల్స్ రాయగా 627వ ర్యాంకు సాధించిన యశ్వంత్ ప్రస్తుతం ఐపీఎస్ శిక్షణ పొందుతున్నాడు. తిరిగి పరీక్ష రాయగా ఈసారి మంచి ర్యాంక్ సాధించాడని తల్లిదండ్రులు ఉమాపతి నాయక్, పద్మ సంతోషం వ్యక్తం చేశారు. యశ్వంత్‌ను కుటంబీకులు, మిత్రులు అభినందించారు.
News April 23, 2025
హయత్‌నగర్: హిజ్రాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

రాత్రి వేళలో ఔటర్ రింగ్ రోడ్ల వెంట ఉంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న హిజ్రాలను హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మెట్ తహశీల్దార్‌కు బైండ్ ఓవర్ చేశారు. ఈ సందర్భంగా సీఐ నాగరాజుగౌడ్ మాట్లాడుతూ.. ఎవరైనా రోడ్ల వెంట అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ వసూళ్లకు పాల్పడినా, వచ్చి పోయేవారికి, వాహనదారులకు ఇబ్బందులకు గురి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News April 23, 2025
ఒంగోలులో TDP నేత హత్య.. లోకేశ్ దిగ్ర్భాంతి

ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య వార్త తనను షాక్‌కు గురిచేసిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘వీరయ్య చౌదరిని దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపడం దారుణం. యువగళం పాదయాత్రలో నాతోపాటు అడుగులు వేసిన వీరయ్య టీడీపీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేశారు. హంతకులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.