News July 22, 2024
కోనసీమ జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షాల వల్ల గోదావరికి వరద పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు అమలాపురంలోని కలెక్టరేట్ నుంచి సోమవారం రాత్రి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తల్లిదండ్రులు వారి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, వాగులు, చెరువుల వైపు వెళ్లనివ్వొద్దని కలెక్టర్ సూచించారు. SHARE IT..
Similar News
News September 16, 2025
మంత్రి కందులను కలిసిన కలెక్టర్

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన కీర్తి చేకూరి మంత్రి కందుల దుర్గేశ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. చారిత్రక ప్రసిద్ధి చెందిన రాజమండ్రికి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన ప్రాంతమని, దానిని మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని కలెక్టర్కు సూచించారు.
News September 15, 2025
తూ.గో పోలీస్ గ్రీవెన్స్కు 40 అర్జీలు

తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం”లో 40 అర్జీలు వచ్చాయి. ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ మురళీకృష్ణ అర్జీలు స్వీకరించారు. అక్కడికక్కడే సంబంధిత పొలీసు అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానకి కృషి చేశారు. అర్జీలలో సివిల్ కేసులు, కుటుంబ సమస్యల గురించి, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులు, ఇతర కేసులు ఉన్నాయన్నారు.
News September 15, 2025
రాజమండ్రి: కలెక్టరేట్ PGRSలో 152 అర్జీలు

ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అలసత్వం వహించరాదని, నిర్ణీత సమయంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన PGRS కార్యక్రమంలో ప్రజల నుంచి 152 ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.