News August 9, 2024
కోనసీమ జిల్లాలో 12న మంత్రి నాదెండ్ల పర్యటన

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈనెల 12 నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ డీవీఎస్ ఏల్లారావు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లాలోని పలు ప్రాంతాలలో ఆయన పర్యటిస్తారన్నారు. రైతులకు చెల్లించే ధాన్యం సొమ్ముల బకాయిలను విడుదల చేస్తారన్నారు.
Similar News
News November 8, 2025
రేపు రాజమండ్రిలో ఉద్యోగమేళా

మెప్మా, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 9న (ఆదివారం) రాజమండ్రి సుబ్రమణ్య మైదానంలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. కనక రాజు శనివారం తెలిపారు. విభిన్న రంగాలకు చెందిన 15కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని వెల్లడించారు. టెన్త్ నుంచి పీజీ, బీటెక్, నర్సింగ్ చేసిన వారు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
News November 8, 2025
ఈనెల 10న యథాతధంగా పీజీఆర్ఎస్: కలెక్టర్

పీజీఆర్ఎస్ కార్యక్రమం ఈనెల 10 సోమవారం యథాతధంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వ్యయప్రయాసలకు గురి కాకుండా తమ డివిజన్, మండల కేంద్రాలు, గ్రామ-వార్డు సచివాలయాల్లోనే అర్జీలు సమర్పించి పరిష్కారం పొందాలని సూచించారు. అలాగే 1100 టోల్‌ఫ్రీ నంబర్ లేదా meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదులు ఇవ్వొచ్చని పేర్కొన్నారు.
News November 8, 2025
రాజమండ్రి: తుఫాను పంట నష్టం అంచనాలు పూర్తి

తూర్పు గోదావరి జిల్లాలో ఇటీవల సంభవించిన మొంథా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట నష్టం అంచనా ప్రక్రియ పూర్తయినట్లు డీఏఓ మాధవరావు శుక్రవారం వెల్లడించారు. మొత్తం 14,602 హెక్టార్లలో వరి, 1,135 హెక్టార్లలో మినుము పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు. వరికి ఎకరాకు రూ.25 వేలు, మినుముకు ఎకరాకు రూ.15 వేలు చొప్పున మొత్తం రూ.38 కోట్లకు పైగా పరిహారాన్ని రైతులకు చెల్లించనున్నట్లు ఆయన వివరించారు.


