News March 29, 2025

కోనసీమ జిల్లాలో 404 రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు: జేసీ

image

రామచంద్రపురం పట్టణంలో పౌరసరపరాల జిల్లా మేనేజర్ బాల సరస్వతి ఆధ్వర్యంలో రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల సరస్వతి మాట్లాడుతూ.. జిల్లా జేసీ నిశాంతి ఆదేశాల మేరకు జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలుకు 404 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ధాన్య సేకరణ సమయంలో శాంపిల్స్ విశ్లేషణ, ప్రమాణాలు, తేమశాతం తదితర అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

Similar News

News September 17, 2025

గొల్లపూడిలో ఉత్సవ్ నిర్వహణకు లైన్ క్లియర్

image

AP: విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో ఉత్సవ్ నిర్వహణకు అడ్డంకులు తొలగాయి. గొడుగుపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయ భూములను వాణిజ్య అవసరాలకు వినియోగించవద్దంటూ నిన్న సింగిల్ బెంచ్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. దీనిని సవాల్ చేస్తూ డివిజనల్ బెంచ్‌లో సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ అప్పీల్ చేసింది. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం సింగిల్ బెంచ్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించింది.

News September 17, 2025

విశాఖలో జీసీసీ బిజినెస్ సమ్మిట్ ప్రారంభం

image

రుషికొండలోని రాడీసన్‌ బ్లూ హోటల్‌‌లో గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్‌ బిజినెస్ సదస్సు ప్రారంభమయ్యింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు సిఐఐ ప్రతినిధులు హాజరయ్యారు.

News September 17, 2025

పల్నాడు జిల్లాలో 30.8 మి.మీ వర్షపాతం

image

పల్నాడు జిల్లాలో గత 24 గంటల్లో 30.8 మి.మీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని మొత్తం ఐదు మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో అత్యధికంగా చిలకలూరిపేటలో 14.4 మి.మీ, నాదెండ్లలో 7.2, పిడుగురాళ్లలో 6.4, నూజెండ్లలో 1.6, ఈపూరులో 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 1.1 మి.మీ వర్షపాతం నమోదైంది.