News April 25, 2024
కోనసీమ జిల్లాలో 480 కంప్లైంట్లు
ఎన్నికల ఉల్లంఘనలపై ఈ నెల 16-23 వరకు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 480 ఫిర్యాదులు వచ్చాయని సీపీఓ వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. వాటిలో 94 ఫిర్యాదులు ఎన్నికలకు సంబంధం లేని వాటిగా గుర్తించి వాటిని తిరస్కరించామన్నారు. 386 ఫిర్యాదులను 100 నిమిషాల లోపు పరిష్కరించామన్నారు. మిగిలిన 37 ఫిర్యాదులను వంద నిమిషాలు తర్వాత పరిష్కరించామని చెప్పారు. వెలగపూడి కార్యాలయానికి వచ్చిన 33 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు.
Similar News
News January 25, 2025
గోపాలపురంలో మాంసం దుకాణాలు బంద్
గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని గోపాలపురం మండలంలో రేపు మాంసం, మద్యం దుకాణాలు బంద్ చేయాలని తహశీల్దార్ కె.అజయ్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ రాత్రి నుంచి ఎలాంటి జంతు వధ చేయరాదన్నారు. చేపల మార్కెట్లను మూసివేయాలన్నారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
News January 25, 2025
రాజానగరం: హత్య కేసులో వ్యక్తికి జీవిత ఖైదు
రాజానగరంలోని రథేయపాలేనికి చెందిన రాంబాబుకు హత్య కేసుకు సంబంధించి జీవిత ఖైదు విధిస్తూ రాజమండ్రి 5వ అదనపు కోర్టు తీర్పు వెలువరించింది. రాజానగరం సీఐ కథనం.. రాంబాబు 2020లో అదే గ్రామానికి చెందిన వెంకన్నను హత్య చేసి, వెంకన్న బాబును గాయపరిచాడు. ఆ ఘటనకు అప్పటి ఎస్సై నాగబాబు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణల అనంతరం శుక్రవారం కోర్టు తీర్పు వెలువరించింది.
News January 25, 2025
రాజమండ్రి : మహిళను వేధించి హత్యాయత్నం.. జైలు
కాకినాడలోని వాకలపూడి వాసి వెంకన్న (25)కు రాజమండ్రి 8వ జిల్లా సెషన్స్ జడ్జి 9ఏళ్ల జైలు, రూ. 7 వేలు జరిమానా విధించారు. కాగా నిందితుడు ఓ మహిళను లైంగికంగా వేధించి , హత్యాయత్నం చేశాడని 2022లో అప్పటి ఎస్సై వి. మౌనిక కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి శుక్రవారం కోర్టు తీర్పు వెలువరించింది.