News February 24, 2025

కోనసీమ జిల్లాలో 95 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు

image

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్‌కు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 95 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా అధికారులు సోమవారం తెలిపారు. కోనసీమలోని 22 మండలాల్లో 64,471 మంది ఓటర్లు ఉన్నారన్నారు. వారిలో పురుషులు 37,114 మంది, మహిళా ఓటర్లు 27,355 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారన్నారు. ఈనెల 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. మార్చి 3వ తేదీన కౌంటింగ్ జరుగుతుందన్నారు.

Similar News

News February 24, 2025

నల్గొండ జిల్లా టాప్ న్యూస్

image

☞ ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రులు ☞ మున్నూరు కాపులు కూడా రెడ్లే: విశారదన్ మహరాజ్ ☞  NLG కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ డే ☞ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల నిరసన ☞ జోరుగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ☞ మహాశివరాత్రికి ముస్తాబవుతున్న శివాలయాలు ☞ యుజీసీ నెట్ సాధించిన ఎంజీయూ విద్యార్థులు

News February 24, 2025

విశాఖ జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

➤ యుాజీసీ జేఆర్ఎఫ్ సాధించిన దివ్యాంగ ఏయూ విద్యార్థి 
➤ వాల్తేర్ డీఆర్ఎంగా లలిత్ బోహ్రా బాధ్యతలు స్వీకరణ
➤ అవమానంతో తన బిడ్డ చనిపోయాడంటూ గోపాలపట్నంలో నిరసన
➤ రుషికొండలో పల్సస్ సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగుల ఆందోళన
➤ ఏయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పరీక్ష ఫీజు గడువు పెంపు(మార్చి 13) 
➤ ఆనందపురం ఎస్ఐ ఎడమ చేతికి తీవ్ర గాయం
➤ విశాఖ ఆర్డీవోపై చర్యలకు జర్నలిస్టు సంఘాల డిమాండ్

News February 24, 2025

కుంభమేళా ఏర్పాట్ల అధ్యయనానికి UP వెళ్లిన AP బృందం

image

AP: 2027లో రాష్ట్రంలో జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం కుంభమేళాలో రాష్ట్ర బృందం అధ్యయనం చేస్తోంది. మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, రాజమండ్రి కమిషనర్ కేతన్ గార్గ్ సహా పలువురు కుంభమేళాను సందర్శించారు. ఏర్పాట్లు, రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ క్లియరెన్స్, భద్రతా చర్యల గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తుల స్నాన ఘాట్ల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.

error: Content is protected !!