News March 22, 2025
కోనసీమ జిల్లా డీఆర్డీఏ పీడీ నియామకం

కోనసీమ డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్గా టి సాయినాథ్ జయచంద్ర నియమితులయ్యారు. ఆయన శుక్రవారం పీడీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇప్పటివరకు పీడీగా పనిచేసిన శివ శంకర్ ప్రసాద్ పదోన్నతపై సర్ఫ్లో ఉన్నతి పథకం రాష్ట్ర డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. కాకినాడలో ఉపాధి హామీ పథకం ఏపీడీగా పనిచేస్తున్న జయచంద్ర కోనసీమ జిల్లా ఏపీడీ బాధ్యతలు చేపట్టారు.
Similar News
News November 12, 2025
మంత్రి గారూ.. కురవి వీరన్నను దర్శించుకునేది ఎప్పుడో..!

MHBD జిల్లాలోని కురవి శ్రీభద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేకమైనది. అయితే, జిల్లాలోనే ఉంటూ దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి కొండా సురేఖ మాత్రం ఇప్పటి వరకు వీరన్నను దర్శించుకోలేదు. దీంతో కోరిన వరాలనిచ్చే కొంగుబంగారమైన వీరన్నకు సైతం మేడారం తరహాలోనే నిధులు మంజూరు చేసి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని, వీరన్నను మంత్రి దర్శించుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
News November 12, 2025
ప్రభుత్వ వైఫల్యం వల్లే పేలుడు: ఖర్గే

ప్రభుత్వ వైఫల్యం వల్లే ఢిల్లీ బ్లాస్ట్ జరిగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ‘దేశ రాజధానిలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. IB, CBI లాంటి ఏజెన్సీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం విఫలమైంది. దర్యాప్తు నివేదిక వచ్చాక మేం మరింత మాట్లాడతాం’ అని తెలిపారు.
News November 12, 2025
నరసరావుపేట: ఎలుకల నివారణ గోడపత్రికల ఆవిష్కరణ

సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో రైతులందరూ భాగస్వాములై తమ పంటలను ఎలుకల బారినుంచి కాపాడుకోవాలని కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ అధ్వర్యంలో సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమంపై గోడపత్రికలు ఆవిష్కరించారు. జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ ద్వారా అందించిన బ్రోమోడయోలిన్ మందును నూనెతో కలిపిన నూకలను తీసుకొని విషపు ఎరను తయారు చేసుకోవాలని చెప్పారు.


