News February 22, 2025

కోనసీమ జిల్లా TODAY TOP NEWS

image

➤ఆలమూరు: తండ్రి చితికి తలకొరివి పెట్టిన కుమార్తె
➤ DRKM: శివరాత్రి ఏర్పాట్లు సమీక్షించిన ఎస్పీ
➤ మండపేట: జాతీయస్థాయి క్రీడలకు ముగ్గురు ఎంపిక
➤ అమలాపురంలో సెలూన్, పార్లర్లో తనిఖీలు
➤ ఉప్పలగుప్తం: సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు
➤ ముమ్మిడివరంలో అలరించిన 8 మంది కవలలు
➤ వాడపల్లిలో జబర్దస్త్ నటి సందడి
➤ అమలాపురం: కనువిందు చేసిన కవలలు

Similar News

News November 23, 2025

MHBD: రేపు ప్రజావాణి కార్యక్రమం రద్దు

image

నవంబర్ 24న జరిగే ప్రజావాణి కార్యక్రమం అనివార్య కారణాలవల్ల రద్దు చేసినట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున, జిల్లా ప్రజలు ప్రజావాణి దరఖాస్థులతో సోమవారం మహబూబాబాద్ కలెక్టరేట్‌కు హాజరు కావొద్దని సూచించారు.

News November 23, 2025

ప్రొద్దుటూరు: బంగారం వ్యాపారి కేసులో కొత్త ట్విస్ట్.!

image

ప్రొద్దుటూరు బంగారం వ్యాపారి <<18366988>>శ్రీనివాసులు కేసులో<<>> కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరదలు పద్మజ బావ శ్రీనివాసులుపై 1 టౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ తిమ్మారెడ్డి వివరాల ప్రకారం.. శ్రీనివాసులు, వెంకటస్వామి కలిసి వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం కోసం ఉమ్మడిగా అప్పులు చేశారు. ఆదాయం అన్న తీసుకొని, అప్పులు తమ్మునిపై రుద్దాడు. ఈ మేరకు వెంకటస్వామి భార్య తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసిందన్నారు.

News November 23, 2025

జనగామలో బాల్య వివాహం నిలిపివేత

image

జనగామలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న బాల్య వివాహాన్ని అధికారులు ఆదివారం నిలిపివేశారు. చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు వచ్చిన సమాచారం మేరకు బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్‌లైన్, పోలీసు శాఖ, ఐసీడీఎస్ శాఖ సిబ్బంది సంయుక్తంగా వెళ్లి బాల్య వివాహాన్ని ఆపారు. జిల్లా సంక్షేమ అధికారి కోదండరాములు మాట్లాడుతూ.. బాల్యవివాహం చేయడం, సహకరించడం, ప్రోత్సహించడం, హాజరుకావడం కూడా చట్టపరంగా శిక్షార్హమని అన్నారు.