News September 5, 2024
కోనసీమ: టాటాఏస్ ఢీకొని రెండేళ్ల బాలుడి మృతి

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం తాడిపూడిలో టాటాఏస్ వాహనం ఢీకొని రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఇర్లపాటి నరేష్ టెంట్ హౌస్ వ్యాపారం చేస్తాడు. గురువారం అతడి వద్ద పనిచేసే గూడపాటి బాబి ఇంటి వద్ద ఉన్న సామగ్రి తీసుకువెళ్లడానికి టాటాఏస్‌పై వచ్చాడు. అక్కడ ఆడుకుంటున్న నరేష్ కుమారుడు లాస్విక్(2)ను గమనించకుండా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. SI శ్రీనివాస్ కేసు నమోదు చేశారు.
Similar News
News September 15, 2025
తూ.గో: నేడు కలెక్టరేట్లో PGRS

రాజమండ్రి కలెక్టరేట్లో సోమవారం PGRS కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను అందజేయవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆమె ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ గురించి అవగాహన కలిగి ఉండాలని కూడా సూచించారు.
News September 14, 2025
రాజమండ్రి ఎంపీకి 7వ ర్యాంక్

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో రాజమండ్రి ఎంపీ పురందీశ్వరికి 13వ స్థానంలో నిలిచారు. ఆయన లోక్‌సభలో మొత్తం 73 ప్రశ్నలు అడగటంతో పాటు 13 చర్చల్లో పాల్గొన్నారు. కాగా ఆయన హాజరు శాతం 86.76గా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.
News September 14, 2025
రాజమండ్రి: లోక్ అదాలత్‌లో 4,733 కేసులు పరిష్కారం

రాజమండ్రిలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 4,733 కేసులు పరిష్కారమయ్యాయి. జిల్లా ఇన్ఛార్జ్ జడ్జి మాధురి ఈ వివరాలను వెల్లడించారు. ఈ కేసుల ద్వారా బాధితులకు రూ.16.35 కోట్లకు పైగా పరిహారం అందనుంది. పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్‌లు ఎంతో ఉపయోగపడతాయని ఆమె తెలిపారు.