News March 17, 2025
కోనసీమ: టెన్త్ పరీక్షలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

నేటి నుంచి జిల్లాలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. వీటి నిర్వహణకు ముమ్మిడివరం ఎయిమ్స్ కళాశాలలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు డీఈవో షేక్ సలీంబాషా తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఏ ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్ రూం నంబర్ 9493819102కు తెలియజేయాలన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేసి స్క్వాడ్లను నియమించామన్నారు.
Similar News
News December 23, 2025
త్వరలో 22వేల గ్రూప్-D పోస్టులకు నోటిఫికేషన్

RRB త్వరలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జోన్లలో కలిపి 22 వేల గ్రూప్-D పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. టెన్త్, ఐటీఐ అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. జనవరి 21 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థుల వయసు 18-33ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంటుంది. నెలకు జీతం రూ. 18,000 చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.rrbapply.gov.in
News December 23, 2025
అడిషనల్ సొలిసిటర్ జనరల్గా కనకమేడల

సుప్రీంకోర్టులో మరో ఇద్దరు అడిషనల్ సొలిసిటర్ జనరల్స్ను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది. ఇందులో మాజీ ఎంపీ, అడ్వకేట్ కనకమేడల రవీంద్రకుమార్, దవీందర్పాల్ సింగ్కు చోటు కల్పించింది. వీరు మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. కాగా రవీంద్ర కుమార్ 2018 నుంచి 2024 వరకు టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.
News December 23, 2025
ఏలూరు: రైలు ఢీకొని యువకుడి మృతి

రైలు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన దెందులూరు మండలం సీతంపేటలో మంగళవారం జరిగింది. కాలి సన్నీ (20) ఐటీఐ పూర్తి చేసి బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల సెలవుపై స్వగ్రామం సీతంపేట వచ్చారు. మంగళవారం బయటకు వెళ్లిన సన్ని రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొంది. ప్రమాదంలో సన్ని మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ శివన్నారాయణ తెలిపారు. కేసు నమోదు చేశామని తెలిపారు.


