News April 10, 2025

కోనసీమ: డీఎస్సీ శిక్షణకు దరఖాస్తులకు ఆహ్వానం

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ-బీసీ కులాలకు చెందిన అభ్యర్ధులకు బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ-2025 పరీక్షకు ఉచిత ఆన్‌లైన్‌ శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారి సత్య రమేష్‌ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ-బీసీ కులాలకు చెందిన అభ్యర్ధులకు టెట్‌ పరీక్షలో అర్హత సాధించి అత్యధిక మార్కులు పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News December 19, 2025

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌లో ఫుట్‌బాల్ స్టార్!

image

స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో హాలీవుడ్ సినిమాలో నటించనున్నారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజీ ‘Fast X: Part 2’లో ఆయన కనిపించనున్నారు. రొనాల్డోకు స్వాగతం పలుకుతూ నటుడు టైరెస్ గిబ్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఫాస్ట్ ఫ్యామిలీ’లోకి వెల్కమ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. 2027 ఏప్రిల్‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది.

News December 19, 2025

చిత్తూరు: పెళ్లయి 21 ఏళ్లు.. 14 మంది పిల్లలు.!

image

చిత్తూరు జిల్లాలో ఓ జంటకు పెళ్లై 21 ఏళ్లలో 14 మంది పిల్లలు పుట్టారంటే నమ్మండి. వీరిలో 7 మంది మగ పిల్లలు, 7 మంది ఆడపిల్లలు జన్మించగా.. వారిలో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. GDనెల్లూరు(M) ఆవల్ కండ్రిగకు చెందిన దంపతులకు 21 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో సదరు మహిళ గురువారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 14వ బిడ్డగా మగ పిల్లాడికి జన్మనిచ్చింది.

News December 19, 2025

NTR: లాడ్జిలో వ్యభిచారం.. ఐదుగురి అరెస్ట్

image

విజయవాడ గాంధీనగర్‌లోని ఓ లాడ్జిలో గురువారం సత్యనారాయణపురం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. లాడ్జి కేంద్రంగా అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయన్న సమాచారంతో తనిఖీలు చేపట్టగా.. వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో నలుగురు మహిళలతో పాటు ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.