News May 19, 2024
కోనసీమ: తీవ్ర విషాదం.. 3వ మృతదేహం లభ్యం

అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వద్ద గౌతమి గోదావరిలో శనివారం <<13271997>>గల్లంతైన ముగ్గురిలో<<>> మూడో మృతదేహం ఆదివారం లభ్యమైంది. సత్తి సంపత్‌రెడ్డి(16)గా గుర్తించారు. నిన్న గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన వారిలో పెంట జయకుమార్(19), సబ్బెల్ల ఈశ్వర్ రెడ్డి(20) మృతదేహాలను వెలికి తీశారు. పోలీసులు చేపట్టిన గాలింపు చర్యల్లో కపిలేశ్వరపురం మండలం తాతపూడి ఇసుక ర్యాంపు వద్ద సంపత్ రెడ్డి డెడ్‌బాడీ లభ్యమైంది.
Similar News
News November 28, 2025
రాజమండ్రి: అన్నా క్యాంటీన్‌ను తనిఖీ చేసిన కమిషనర్

అన్నా క్యాంటీన్ల నిర్వహణలో ఎటువంటి లోపాలు ఉండకూడదని, సమయపాలన కచ్చితంగా పాటించాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. శుక్రవారం ఆయన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడి, రోజువారీ హాజరుపై ఆరా తీశారు. పేదలకు అందించే భోజనం ఎల్లప్పుడూ నాణ్యతగా ఉండేలా చూస్తూ, మెనూను తప్పకుండా పాటించాలని ఆయన ఆదేశించారు.
News November 28, 2025
మారిన తూ.గో స్వరూపం.. పెరిగిన ఓటర్ల సంఖ్య

జిల్లాల పునర్విభజనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా స్వరూపం మరోసారి మారనుంది. మండపేట నియోజకవర్గం అదనంగా చేరడంతో జిల్లాలో మండలాల సంఖ్య 21కి, నియోజకవర్గాల సంఖ్య ఏడు నుంచి ఎనిమిదికి పెరిగాయి. నవంబర్ 11 నాటికి జిల్లా ఓటర్ల సంఖ్య 16,23,528 ఉండగా, మండపేట నియోజకవర్గం చేరికతో మొత్తం ఓటర్ల సంఖ్య 18,37,852 కు పెరిగింది.
News November 28, 2025
తూర్పు గోదావరి జిల్లాలో బడి బస్సులపై ప్రత్యేక డ్రైవ్

విద్యాసంస్థలకు చెందిన బస్సుల భద్రతా ప్రమాణాలను తనిఖీ చేసేందుకు నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4 వరకు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు డీటీఓ ఆర్. సురేశ్ తెలిపారు. గురువారం సాయంత్రం రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ డ్రైవ్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో 2,000కు పైగా బస్సులను నాలుగు ప్రత్యేక బృందాలు తనిఖీ చేస్తాయని డీటీఓ వివరించారు.


