News May 22, 2024

కోనసీమ: నిండు ప్రాణాన్ని కాపాడిన హైవే సిబ్బంది

image

హైవే పెట్రోలింగ్ సిబ్బంది రావులపాలెం వైపు గస్తీ నిర్వహిస్తుండగా సిద్ధాంతం బ్రిడ్జిపై సుమారు 45 ఏళ్ల మహిళ గోదావరిలోకి దూకేందుకు ప్రయత్నించారు. గమనించిన హైవే పెట్రోలింగ్ సిబ్బంది రాజబాబు, దుర్గారావు, విజయ చందర్ వెంటనే చేరుకుని ఆ మహిళను అతి కష్టం మీద ఆపగలిగారు. ఆ మహిళను తమ వెంటబెట్టుకుని రావులపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులకు బ్రిడ్జిపై జరిగిన సంఘటన వివరించారు.

Similar News

News December 22, 2025

బీచ్ వాలీబాల్‌లో మెరిసిన తూ.గో కుర్రాళ్లు

image

బాపట్లలో జరిగిన బీచ్ వాలీబాల్ పోటీల్లో దుద్దుకూరుకు చెందిన మల్లిపూడి చందు, తాడిపూడికి చెందిన వేములూరు కార్తీక్ ప్రథమ స్థానంలో నిలిచారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వీరు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం గ్రామస్థులు వీరిని ఘనంగా అభినందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించి తల్లిదండ్రుల ఆశయాలు నెరవేరుస్తామని యువకులు ధీమా వ్యక్తం చేశారు.

News December 22, 2025

రాజమండ్రి: నేడు PGRS కార్యక్రమం

image

రాజమండ్రి కలెక్టరేట్‌లో సోమవారం PGRS నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్ తెలిపారు. ప్రజలు తమ అర్జీలను వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఫిర్యాదుల స్థితిగతుల కోసం 1100 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని కోరారు. అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన వెల్లడించారు.