News October 2, 2024
కోనసీమ: పట్టభద్రులూ.. ఓటు నమోదు చేసుకోండి

గతంలో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు నమోదు చేసుకున్న ఓటు ప్రస్తుతం ఉండదని ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని మండపేట ఎన్నికల డీటీ అవతార్ మెహర్ బాబా పేర్కొన్నారు. మండపేట తహశీల్దార్ కార్యలయంలో మంగళవారం రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2021 అక్టోబర్ 31 నాటికి పట్టభద్రులైన వారు ఓటరుగా నమోదయ్యేందుకు అర్హులన్నారు.
Similar News
News December 5, 2025
ఒత్తిడికి లోనుకాకుండా చదవాలి: కలెక్టర్

తాళ్లపూడి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన మెగా PTM 3.0ను కలెక్టర్ కీర్తి చేకూరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అన్నదేవరపేట ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూల్, అన్నదేవరపేట ప్రభుత్వ హైస్కూల్, వేగేశ్వరపురం ప్రభుత్వ హైస్కూల్లను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్.. ఒత్తిడికి లోనుకాకుండా చదవాలని, వెనుకబడిన సబ్జెక్టుల్లో ప్రత్యేక తరగతులకు హాజరు కావాలని విద్యార్థులకు సూచించారు.
News December 5, 2025
రాజమండ్రి: 5000 కెమెరాలు..17 డ్రోన్లతో నిఘా

తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 5 వేల సీసీ కెమెరాలు, 17 డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అదుపు చేయగలిగామని ఎస్పీ డి. నరసింహ కిషోర్ తెలిపారు. గత 11 నెలల కాలంలో 1137 డ్రంక్ అండ్ డ్రైవ్, 399 పేకాట, 242 కోడి పందాలు, 126 సారా, 49 గంజాయి కేసులు నమోదు చేశామన్నారు. అదృశ్యమైన 136 మంది బాలికల్లో 133 మందిని గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు.
News December 5, 2025
రాజమండ్రిలో నిలిచిన విమాన సర్వీసులు

పైలట్ల సమ్మె కారణంగా మధురపూడి విమానాశ్రయంలో సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మూడు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. గురువారం హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు, 3.30 గంటలకు రావాల్సిన విమానాలు రద్దయ్యాయి. దీంతో ఇక్కడ నుంచి బయలుదేరాల్సిన రిటర్న్ సర్వీసులను అధికారులు నిలిపివేశారు. అలాగే దిల్లీ, హైదరాబాద్ నుంచి రావాల్సిన పలు సర్వీసులు సుమారు 4 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి.


