News July 15, 2024

కోనసీమ: భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం తామరపల్లికి చెందిన ఎం.భవాని హత్య కేసులో ఆమె భర్త శ్రీనుకు జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి విజయ్ గౌతమ్ సోమవారం తీర్పునిచ్చినట్లు ఎస్పీ శ్రీధర్ తెలిపారు. 2021 OCT 13న తన కుమార్తె భవానీని భర్త శ్రీను హత్య చేశాడని గుత్తుల శేషారావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారన్నారు. విచారణలో నేరం రుజువు కావడంతో నిండితుడికి శిక్ష విధించారని తెలిపారు.

Similar News

News November 3, 2025

మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా సోము వీర్రాజు

image

బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా అధిష్ఠానం ఆయనను నియమించింది. ఎమ్మెల్యే కోటా ద్వారా మండలిలోకి వచ్చిన వీర్రాజు ఇకపై పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. ఇప్పటివరకు ఫ్లోర్ లీడర్ లేకపోవడంతో, ఆయన సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని ఈ కీలకపదవిని కేటాయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

News November 3, 2025

నేడు యథాతథంగా పీజీఆర్‌ఎస్‌: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం సోమవారం యథాతథంగా జరుగుతుందని కలెక్టర్‌ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలు జిల్లా కేంద్రానికి రాకుండా తమ డివిజన్, మండల కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్జీలు సమర్పించి సమస్యలకు పరిష్కారం పొందాలని ఆమె సూచించారు. ఫిర్యాదులను 1100 టోల్ ఫ్రీ నంబర్ లేదా Meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చని కలెక్టర్‌ పేర్కొన్నారు.

News November 2, 2025

1,185 కుటుంబాలకు రూ.23.26 లక్షల సాయం: కలెక్టర్

image

తూర్పుగోదావరి జిల్లాలో 1,185 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.23.26 లక్షల ప్రత్యేక ఆర్థిక సహాయం అందజేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘మొంథా’ తుపాను ప్రభావంతో నష్టపోయిన కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో మండల స్థాయిలో లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.