News October 1, 2024

కోనసీమ: మహిళ ఫిర్యాదు.. మాజీ MPTC అరెస్ట్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట రూరల్ మండలానికి చెందిన మాజీ MPTC, RBK ఛైర్మన్ చందర్రావును అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు SI సురేష్‌బాబు సోమవారం తెలిపారు. మాజీ MPTC చందర్రావు తనను దుర్భాషలాడుతూ కొట్టాడని కేశవరానికి చెందిన మంగాదేవి గత నెల 20వ తేదీన ఫిర్యాదు చేసినట్లు SI పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు ఆధారంగా చందర్రావును అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చగా, జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారన్నారు.

Similar News

News December 30, 2024

2024@ ఉమ్మడి తూ.గోలో పొలిటికల్ పిక్చర్ ఛేంజ్

image

ఉమ్మడి తూ.గో జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని 2024 ఎన్నికలు మార్చేశాయి. 2019లో 19 నియోజకవర్గాల్లో YCP 14, TDP 4, జనసేన ఒక స్థానంలో నెగ్గాయి. కాగా ఈ ఎన్నికల్లో 3 ఎంపీ సీట్లతో పాటు మొత్తం 19 నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి జిల్లా రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. ఇక్కడి నుంచి గెలిచిన పవన్ డిప్యూటీ సీఎం కావడం విశేషం.

News December 30, 2024

కోరుకొండలో రేవ్ పార్టీపై పోలీసుల దాడి

image

తూ.గో జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ వద్ద ఓ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. ఐదుగురు మహిళలు, 14 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. న్యూ ఇయర్ నేపథ్యంలో పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News December 30, 2024

రాజమండ్రి: స్పా సెంటర్‌లో వ్యభిచారం

image

రాజమండ్రి జేఎన్ రోడ్‌లో హ్యాపీ స్ట్రీట్ దగ్గర్లో గల ఓ స్పా సెంటర్‌లో ఆదివారం రాత్రి ప్రకాష్ నగర్ పోలీసు స్టేషన్ సీఐ బాజీలాల్ తనిఖీ చేశారు. అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్టు గుర్తించారు. స్పా నిర్వాహకులు, ఇద్దరు విటులను ఆరుగురు బాధిత యువతులను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించినట్లు సెంట్రల్ జోన్ డీఎస్పీ రమేష్ బాబు తెలిపారు. స్పా నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.