News April 13, 2025

కోనసీమ: మోగనున్న పెళ్లి బాజాలు.. మండపాలకు డిమాండ్

image

కొంత విరామం తర్వాత మళ్లీ పెళ్లి బాజాలు మోగనున్నాయి. దీంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం, కొత్తపేట, ముమ్మిడివరం, అల్లవరం, రాజోలు, పి.గన్నవరం మండలాల పరిధిలో కళ్యాణ మండపాలకు డిమాండ్ పెరిగింది. ఈవెంట్ ఆర్గనైజర్లు, కళ్యాణ మండపాల నిర్వాహకులు సైతం బిజీ అయ్యారు. జూన్ వరకు ముహూర్తాలు ఉన్నాయి. పంచాంగకర్తలు చెప్పిన శుభ ముహూర్తాలు. ఏప్రిల్‌: 13,16,20,30 మే: 1,7,8,9,10,11,14,18,23 జూన్‌: 4,5,6,7,8

Similar News

News October 15, 2025

భారీగా తగ్గిన IPL విలువ

image

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) విలువ వరుసగా రెండో ఏడాది పడిపోయింది. 2023లో రూ.93,500 కోట్లున్న వాల్యూ 2024 సీజన్ నాటికి రూ.82,700కు తగ్గింది. 2025లో మరో రూ.6,600 కోట్లు తగ్గి రూ.76,100 కోట్లకు పడిపోయింది. గతేడాదితో పోల్చితే 8% డ్రాప్ నమోదైంది. స్పాన్సర్స్‌గా ఉన్న బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అవడం, TVని డిజిటల్ మీడియా ఓవర్‌‌టేక్ చేయడం తదితర అంశాలు ఇందుకు కారణాలు.

News October 15, 2025

సిద్దిపేట: బాలికల పాఠశాలల్లో సీట్ల భర్తీకి రేపే లాస్ట్

image

సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల్లోని బాలికల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నట్లు డీసీఓ పోలోజు నరసింహచారి బుధవారం తెలిపారు. సిద్దిపేట రూరల్, హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్, ములుగు సహా 13 మండలాల్లోని బాలికల పాఠశాలల్లో ఈ అవకాశం ఉంది. ఆసక్తి గల విద్యార్థులు సీట్ల కోసం ఈ నెల 16లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.

News October 15, 2025

గూగుల్‌తో విశాఖ రూపురేఖలే మారిపోతాయ్: లోకేశ్

image

గూగుల్ డేటా సెంటర్ విశాఖ రూపురేఖలనే మార్చేస్తుందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఇది కేవలం డేటా సెంటర్ కాదని.. దీంతో ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖ వస్తున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్రలో టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. నవంబర్‌లోనే టీసీఎస్ వస్తుందని, డిసెంబర్‌లో కాగ్నిజెంట్ పనులు ప్రారంభిస్తుందన్నారు.