News February 26, 2025
కోనసీమ మోనాలిసా అంటూ పోస్టింగ్.. కేసు నమోదు

మైనర్ బాలికపై ఇంస్టాగ్రామ్‌లో పోస్టింగ్ పెట్టి ఆమెను మనస్తాపానికి గురిచేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ జ్వాలాసాగర్ బుధవారం తెలిపారు. సిహెచ్ గున్నేపల్లి సత్తెమ్మ తల్లి తీర్థంలో అమలాపురానికి చెందిన మైనర్ బాలిక పూసలు అమ్ముకుంటుందన్నారు. అమలాపురం చింతాడ గరువుకు చెందిన దేవిశ్రీప్రసాద్ వీడియోలు తీసి ఇంస్టాగ్రామ్‌లో కోనసీమ మోనాలిసా అంటూ పోస్టింగ్ చేశాడన్నారు. దీనిపై బాలిక పినతల్లి ఫిర్యాదు చేశారు.
Similar News
News March 17, 2025
11 మంది సెలబ్రిటీలపై కేసులు

TG: బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న పలువురు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. 11 మందిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, శ్యామల, కిరణ్ గౌడ్, సన్నీ యాదవ్, సుధీర్ రాజు, అజయ్‌పై కేసులు నమోదయ్యాయి.
News March 17, 2025
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. అత్యధికంగా ఇవాళ ఏపీలోని మన్యం జిల్లా వీరఘట్టంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 42.6, ప్రకాశం జిల్లా పెద్దారవీడు, నంద్యాల జిల్లా గోనవరంలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలోని భద్రాద్రి, ఆదిలాబాద్‌లో 42 డిగ్రీలు, కొమురంభీంలో 41.8, మెదక్‌లో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News March 17, 2025
తాగునీటి సమస్యపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్

శ్రీ సత్య సాయి జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని, ఆర్డీవోలు నీటి సమస్యపై నిరంతరం పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం నుంచి తాగునీరు, వడగాల్పులు, పి-4 సర్వే, రీ సర్వే, పీజీఆర్ఎస్ అంశాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని విపత్తుల శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని నీటి సమస్య తలెత్తే ప్రాంతాలను గుర్తించాలన్నారు.