News March 23, 2025
కోనసీమ: రేపు యథావిధిగా మీకోసం వేదిక: కలెక్టర్

అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన అమలాపురం నుంచి ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News March 29, 2025
జగిత్యాల జిల్లాలో 7 పోలీస్ స్టేషన్ల అప్‌గ్రేడేషన్‌కు గ్రీన్ సిగ్నల్

జగిత్యాల జిల్లాలోని జగిత్యాల టౌన్, జగిత్యాల రూరల్, రాయికల్, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి, మల్యాల పోలీస్ స్టేషన్ల అప్‌గ్రేడేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రజలకు నాణ్యమైన, మెరుగైన సేవలు అందించేందుకు, క్రైమ్ రేట్ తగ్గించడానికి పోలీసు శాఖ చర్యలు చేపడుతుంది. జనాభా ప్రాతిపదికన అప్‌గ్రేడ్ చేయనున్నారు. అంతేకాకుండా భీమారం, ఎండపల్లి కొత్త మండలాల్లో పోలీస్ స్టేషన్‌లను నిర్మించనున్నారు.
News March 29, 2025
అమెరికా సుంకాలు భారత్‌కు మంచిదే: నీతి ఆయోగ్

చైనా, మెక్సికో, కెనడా దేశాలపై వచ్చే నెల 2 నుంచి US విధించనున్న అదనపు సుంకాలు భారత్ మంచికేనని నీతి ఆయోగ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ప్రవాకర్ సాహూ అభిప్రాయపడ్డారు. ‘ప్రాథమికంగా చూస్తే ట్రంప్ ప్రతీకార సుంకాలు భారత్‌ను మరీ ఇబ్బంది పెట్టవు. ఏవో కొన్ని రంగాలు స్వల్పంగా ప్రభావితమవుతాయి. కానీ దీని వల్ల అపారమైన అవకాశాలు కూడా ఉన్నాయి’ అని వివరించారు. US దిగుమతుల్లో 50శాతం చైనా, మెక్సికో, కెనడా నుంచే ఉన్నాయి.
News March 29, 2025
విశాఖలో ప్రేమ పేరుతో మోసం

యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఓ యువకుడిపై మల్కాపురం పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. CI విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. 40వ వార్డు AKC కాలనీకి చెందిన ప్రవీణ్ అదే కాలనీలో ఉంటున్న యువతిని ప్రేమించాడు. కాగా యువతి గర్భం దాల్చగా పెళ్లికి నిరాకరించాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా యువకుడు పెళ్లికి నిరాకరించడంతో కేసు నమోదు చేసుకున్నారు.