News March 6, 2025
కోనసీమ : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఈతకోట రొయ్యల ఫ్యాక్టరీలో డ్యూటీ చేసే పమ్మి చినబాబు(30) బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ప.గో జిల్లా సిద్ధాంతానికి చెందిన చినబాబు పని ముగించుకుని మోటార్ సైకిల్ పై ఇంటికి వెళ్తూండగా బస్సును తప్పిస్తూ, ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టాడు. తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందాడు.
Similar News
News November 2, 2025
VJA: మరి కాసేపట్లో జడ్జి ముందు జోగి రమేశ్ హాజరు

కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను ఇవాళ సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరికాసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెట్టి కష్టడి కోరే అవకాశం కనిపిస్తోంది. అంతకంటే ముంది విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయనున్నారు.
News November 2, 2025
అనంతపురం: డివైడర్‌ను ఢీకొన్న బైకు.. యువకుడు మృతి

అనంతపురం నగర శివారులో ఆదివారం రోడ్డు ప్రమాదంలో ఆలుమూరుకు చెందిన అవినాష్ అనే యువకుడు మృతి చెందాడు. అవినాష్ బైక్‌పై అనంతపురం నుంచి హిందూపూర్‌కి వెళుతుండగా డివైడర్‌ను ఢీకొని కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అవినాష్‌కు గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అవినాష్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News November 2, 2025
ఏఐ ప్రభావాన్ని పెంచేలా నియామకాలు: సత్య నాదెళ్ల

భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్ విస్తరణ స్మార్ట్‌గా ఉంటుందని సంస్థ CEO సత్య నాదెళ్ల తెలిపారు. కంపెనీలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతామని, ఈ నియామకాలు AI ప్రభావాన్ని పెంచేలా ఉంటాయని స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా యాంత్రికంగా ఏదీ ఉండదన్నారు. AI సాయంతో వేగంగా పనిచేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. కాగా ఈ ఏడాది జూన్ నాటికి కంపెనీలో 2.28L మంది ఉద్యోగులున్నారు. పలు దశల్లో 15K మందికి లేఆఫ్స్ ఇచ్చింది.


