News March 6, 2025
కోనసీమ : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఈతకోట రొయ్యల ఫ్యాక్టరీలో డ్యూటీ చేసే పమ్మి చినబాబు(30) బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ప.గో జిల్లా సిద్ధాంతానికి చెందిన చినబాబు పని ముగించుకుని మోటార్ సైకిల్ పై ఇంటికి వెళ్తూండగా బస్సును తప్పిస్తూ, ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టాడు. తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందాడు.
Similar News
News April 12, 2026
విజయవాడలో గంజాయి ముఠా గుట్టురట్టు

వియజవాడలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు. శనివారం సాయంత్రం శిఖామణి సెంటర్ సమీపంలో గంజాయి ఉందన్న సమాచారం మేరకు మాచవరం పోలీసులు మెరుపు దాడి చేశారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా, జాగర్లమూడి వరుణ్ కుమార్ @ చిన్న బాబు, ప్రత్తిపాటి బాబు @ చింటూ, మరికంటి ప్రభు కుమార్ @ ప్రభు అని సీఐ వెంకటరమణ తెలిపారు. వారి వద్ద నుంచి రెండు కేజీలు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
News April 12, 2026
ఖమ్మం: అధికారుల ‘కక్కుర్తి’.. ఖజానాకు చిల్లు

జిల్లాలో కొందరు ప్రభుత్వ అధికారుల తీరు ‘వేతనం ప్రభుత్వానిది..వాహనం నాది’ అన్నట్లుగా ఉంది. పైస్థాయి అధికారులకు ప్రభుత్వం అద్దె వాహనాలు ఏర్పాటు చేసినప్పటికీ, కొందరు అధికారులు తెరవెనుక సొంత వాహనాలనే వాడుతున్నారు. అయితే, బిల్లులకు మాత్రం ట్యాక్సీ నంబర్లతో నకిలీ పత్రాలను సృష్టిస్తూ ఖజానా లూటీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సొమ్ము చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.
News April 12, 2026
నల్గొండ: తప్పు ఒకరిదైతే శిక్ష మరొకరికి..!

మహాత్మాగాంధీ వర్సిటీ అవుట్‌సోర్సింగ్ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏజెన్సీ నిర్వాహకులు సకాలంలో జీఎస్టీ చెల్లించకపోవడంతో అధికారులు వేతనాలను నిలిపివేశారు. ఫలితంగా 113 మంది చిరుద్యోగులు రెండు నెలలుగా జీతాల్లేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. అధికారుల పర్యవేక్షణ లోపం, ఏజెన్సీ నిర్వాహకుల బాధ్యతారాహిత్యం మధ్య సామాన్య కార్మికులు బలిపశువులవుతున్నారు.


