News June 29, 2024
కోనసీమ: లారీ ఢీకొని భర్త మృతి.. భార్యకు తీవ్ర గాయాలు
అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. లారీ బైక్‌ను ఢీకొన్న ఘటనలో వానపల్లికి చెందిన శ్రీనివాస్(49) మృతి చెందగా, అతడి భార్య లక్ష్మీ నారాయణమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. విష పురుగు కరిచిందని కొత్తపేటలో చికిత్స చేయించుకొని తిరిగి బైక్‌పై వెళుతున్న దంపతులను వానపల్లిలో లారీ ఢీకొట్టింది. ద్వారపూడి నుంచి ధాన్యం లోడుతో వస్తున్న లారీ గణేష్‌నగర్ సెంటర్ వద్ద వీరిని ఢీకొట్టింది.
Similar News
News December 11, 2024
రైల్వే ప్రాజెక్టుపై సానుకూలంగా స్పందించారు: ఎంపీ హరీష్
టీడీపీ పార్లమెంటరీ నేత శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీలతో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను మంగళవారం కలిశామని అమలాపురం ఎంపీ హరీష్ మధుర్ తెలిపారు. రైల్వే అభివృద్ధికి అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపామన్నారు. కోనసీమ జిల్లాలో రైల్వే ప్రాజెక్టు కోసం లేఖ అందజేశామని, దివంగత నేత బాలయోగి హయాంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.
News December 10, 2024
రాజమండ్రి: ‘టీడీపీలో బీసీలకు అన్యాయం జరుగుతోంది’
టీడీపీలో బీసీలకు నిజంగా అన్యాయం జరుగుతుందని, బీసీ కులాల గొంతు నొక్కిన చంద్రబాబు చరిత్రలో బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తిగా మిగిలిపోతారని జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభ సీట్ల కేటాయింపులో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అన్యాయమన్నారు. ఈనెల 13న రైతులకు అండగా కలెక్టర్కు వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు.
News December 9, 2024
తూ.గో: మళ్లీ పులి సంచారం.?
తూ.గో. జిల్లా ఏజెన్సీ ఏరియాలో కొద్దిరోజులుగా పులి సంచారం ప్రజలను భయపెడుతోంది. ప్రత్తిపాడు పరిసర ప్రాంతాల్లోనూ పులి సంచరిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాపన్నధార ఏరియాలో ఆదివారం ఓ పశువు చనిపోవడంతో పోలీసు అధికారులకు స్థానికులు సమాచారమిచ్చారు. పశువును చంపింది పులి లేదా ఏదైనా అడవి జంతువా అనేది అధికారులు నేడు క్లారిటీ ఇవ్వనున్నారు. ఇటీవల 45 రోజులపాటు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పులి తిరిగింది.