News January 30, 2025

కోనసీమ వాసి గెలిచేనా…?

image

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫిబ్రవరి 27న జరగనుంది. కూటమి తరఫున TDP అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థిగా డీవీ రాఘవులు పేర్లు ఖరారయ్యాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం గుత్తెనదీవికి చెందిన రాజశేఖరం గత ఎన్నికల్లో కాకినాడ రూరల్ టికెట్ ఆశించారు. అప్పుడు జనసేనకు వెళ్లడంతో MLC అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. మరి ఆయన గెలుస్తారా? లేదా? కామెంట్ చేయండి.

Similar News

News November 21, 2025

నిర్మల్‌ ఏఎస్పీగా సాయికిరణ్

image

రాష్ట్రంలో 32 మంది IPSలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మల్ ఏఎస్పీగా సాయికిరణ్, భైంసా ఎస్డీపీవోగా రాజేశ్ మీనా నియమితులయ్యారు. రాజేశ్ మీనా గతంలో నిర్మల్ ఏఎస్పీగా పని చేశారు. ఈ మేరకు వీరు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.

News November 21, 2025

వనపర్తి నూతన ఎస్పీగా డి.సునీత‌

image

రాష్ట్రంలో ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో నూతన ఎస్పీగా సునీత‌ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే సునీత‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు, పోలీసు వ్యవస్థ బలోపేతానికి ఆమె కృషి చేస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

News November 21, 2025

IPSల బదిలీ.. సిటీకి కొత్త బాస్‌లు

image

రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. CID డీఐజీగా పరిమళ నూతన్, మహేశ్వరం DCPగా నారాయణరెడ్డి, నార్కోటిక్ SPగా పద్మజా, మల్కాజిగిరి DCPగా శ్రీధర్, సౌత్ జోన్ DCPగా కిరణ్ ఖారే, టాస్క్‌ఫోర్స్ DCPగా వైభవ్ గైక్వాడ్, ఎస్ఎంఐటీ డీసీపీగా రూపేశ్, గవర్నర్ ఏడీసీగా పి.సుభాష్, టీజీ ట్రాన్స్‌కో ఎస్పీగా శ్రీనివాస్, రాచకొండ క్రైమ్స్ డీసీపీగా గుణశేఖర్‌ను నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి.