News January 11, 2026

కోనసీమ వాసు కార్టూనిస్ట్ రాముకు అరుదైన ఘనత

image

కోనసీమ వాసికి అరుదైన ఘనత దక్కిందని ఏపీ కార్టూనిస్టుల సంఘం తెలిపింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పులికాట్ సరస్సు సమీపంలో ఫ్లేమింగో ఫెస్టివల్ శనివారం ప్రారంభమైంది. దీనిలో భాగంగా వ్యంగ్య చిత్రకళా ప్రదర్శనలో అమలాపురం రూరల్ బండారులంక గ్రామానికి చెందిన ప్రముఖ కార్టూనిస్ట్ మాడా రాము పర్యావరణ రక్షణ, వన్యప్రాణుల, వృక్ష సంపద ఆవశ్యకత అంశంపై గీసిన కార్టూన్ ప్రదర్శన‌కు ఈ అర్హత సాధించింది.

Similar News

News January 16, 2026

పాలమూరు: ‘KCR హయాంలో ప్రాజెక్ట్‌లు నిర్లక్ష్యం’

image

మాజీ సీఎం KCR పాలనలో తెలంగాణలోని ప్రాజెక్ట్‌లను పట్టించుకోలేదని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్మల్ బహిరంగ సభలో విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ.. చిన్న సాగునీటి ప్రాజెక్ట్‌లను గాలికి వదిలేశారన్నారు. గోండు గూడెంలలో ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ టూరిజం అభివృద్ధిపై దృష్టి పెట్టిందన్నారు.

News January 16, 2026

నిజామాబాద్ ఫస్ట్.. నల్గొండ సెకండ్

image

ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో నల్గొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. 5.23 లక్షల టన్నులతో జిల్లా రెండో స్థానంలో ఉండగా, 6.93 లక్షల మెట్రిక్ ​టన్నుల ధాన్యాన్ని సేకరించి నిజామాబాద్‌ మొదటి స్థానంలో ఉంది. పౌరసరఫరాల శాఖ ధాన్యం కొనుగోలు చేసి రైతులకు వారంలోగా నగదును బ్యాంకు ఖాతాలో జమ చేయడంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల వైపు మొగ్గు చూపలేదు.

News January 16, 2026

గుర్ల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ

image

గుర్ల పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించారు . పండగ సందర్భంగా ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు తగు సూచనలు సలహాలు ఇచ్చి క్షేమంగా గమ్యస్థానం చేరే విధంగా చూడాలని ఎస్సై నారాయణరావుకు సూచించారు. అనంతరం పోలీస్ సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు.