News July 27, 2024
కోనసీమ: విద్యుత్ సమస్యలపై మంత్రికి ఎమ్మెల్యే వినతి
రాజోలు నియోజకవర్గంలోని విద్యుత్ సమస్యలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలో విద్యుత్ కొరతతో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్న సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సమస్యల పరిష్కారానికి గుడిమెళ్లంక, గుడిమూలలో విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు చేయాలని, లక్కవరం, రాజోలు సబ్ స్టేషన్ల కెపాసిటీని 5ఎంవీఏ నుంచి 8 ఎంవీఏకు పెంచాలని కోరారు.
Similar News
News October 5, 2024
తూ.గో.జిల్లా టుడే టాప్ న్యూస్
*రాజమండ్రి కార్యకర్తకు మంత్రి లోకేశ్ భరోసా
*కాకినాడలో 8న మినీ జాబ్ మేళా
*పవన్ కళ్యాణ్ కాలయాపన చేస్తున్నారు: సీపీఐ
*అధికారులకు జిల్లా కలెక్టర్ హెచ్చరిక
*రాళ్లపాలెం: కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ
*డిప్యూటి సీఎంను కలిసిన మార్క్ ఫెడ్ డైరక్టర్ నరసింహరావు
*రాజమండ్రి: పుష్కరాలకు శోభాయమానంగా కోటిలింగాల ఘాట్
*తూ.గో.జిల్లా మహిళకు నారా లోకేశ్ హామీ
*గొల్లప్రోలు: ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్‌డెడ్
News October 5, 2024
బాధితుడు కోలుకునేందుకు సాయం చేస్తాం: మంత్రి లోకేశ్
కాలేయ సమస్యతో బాధపడుతున్న రాజమండ్రి రూరల్ కాతేరు వాసి సానబోయిన రాంబాబు కోలుకునేందుకు అండగా నిలుస్తామని మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. 1982 నుంచి పార్టీ విధేయుడిగా పనిచేస్తున్న రాంబాబు అనారోగ్యంతో బాధపడుతున్నాడని అతని కుటుంబానికి సాయం చేయాలని జాహ్నవి స్వామి ఎక్స్‌లో పోస్టు చేశారు. దీంతో లోకేశ్ స్పందించి కార్యకర్తలే పార్టీకి ప్రాణమని అతనికి అండగా నిలుస్తామన్నారు.
News October 5, 2024
తునిలో కిలో టమాటాలు రూ.100
ఎన్నడూ లేని విధంగా కూరగాయల ధరలు కొండెక్కి కూర్చోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నామన్నారు. శనివారం తుని మార్కెట్లో కిలో టమాటాలు రేటు వందకు చేరువలో ఉంది. ఉల్లిపాయలు రూ.50, బీరకాయ రూ.60, చిక్కుడుకాయ రూ .100, క్యాప్సికం రూ.90, మిర్చి రూ.40, అనపకాయలు రూ.30, బోబ్బురి చిక్కుళ్లు రూ.60 పలుకుతున్నట్లు వ్యాపారస్థులు చెబుతున్నారు.