News October 17, 2024
కోనసీమ: సీఎం హామీ.. ‘పల్లాలమ్మ’ ఆలయ అభివృద్ధికి కార్యాచరణ
కొత్తపేట వానపల్లి పల్లాలమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి సీఎం ఇచ్చిన హామీ మేరకు నిర్మాణ పనులు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధమైనట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, ఇంజినీర్లతో ఆలయ అభివృద్ధి ప్రతిపాదనలు అంచనాలపై ఆయన సమీక్షించారు. వానపల్లి గ్రామస్థులు కోరిన విధంగా అవసరాల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.
Similar News
News November 5, 2024
మత్స్యకారుల సమస్యలకు పరిష్కారం: పవన్ కళ్యాణ్
యు.కొత్తపల్లి మత్స్యకారుల సమస్యలకు పరిష్కారం చూపుతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గొల్లప్రోలులో జరిగిన సమావేశంలో ఆయన ఈ సమస్యలపై ఉప్పాడ కొత్తపల్లి మత్స్యకారులను వివరాలు తెలుసుకున్నారు. వారు అరబిందో ఫార్మా కంపెనీ వ్యర్థాలను సముద్రంలో విడుదల చేయడం వల్ల మత్స సంపద నశిస్తుందని ఆయన దృష్టికి వచ్చారు. దీనిపై ఫార్మా కంపెనీ అధికారులు, మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు
News November 4, 2024
తూ.గో: మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్
తూ.గో.జిల్లాకు చెందిన నాగమణి అనే మహిళ బహ్రెయిన్ వెళ్లి ఇబ్బంది పడుతున్న విషయం సోషల్ మీడియా ద్వారా మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకువచ్చింది. దీనిపై స్పందించిన లోకేశ్ ఆమెను రాష్ట్రానికి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆమెను రాష్ట్రానికి తీసుకువచ్చారు. దీనిపై నాగమణి లోకేశ్‌కు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. తనను ముగ్గురు ఏజెంట్లు మోసం చేశారని ఆమె వాపోయారు.
News November 4, 2024
తూ.గో : ప్రాణం తీసిన క్రెడిట్ కార్డు
తూ.గో జిల్లాలో ఓ క్రెడిట్ కార్డు యువకుడి మృతికి కారణమైంది. గండేపల్లి(M) పి.నాయకంపల్లికి చెందిన సత్యసాయి(22) బ్రాయిలర్ కోళ్లు పెంచుతున్నాడు. ఈక్రమంలో గత నెల 30న ఫ్రెండ్ క్రెడిట్ కార్డుతో రూ.1000 పెట్రోల్ కొట్టించుకున్నాడు. ఈ విషయం అతనికి తెలిస్తే అవమానంగా ఉంటుందని భావించాడు. అదే రోజు రంగంపేట మండలం కోటపాడు సమీపంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా మృతదేహాన్ని గుర్తించారు.