News March 5, 2025
కోనసీమ : 1000 ఓట్లు కూడా దాటని ఎమ్మెల్సీ అభ్యర్థులు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన 35 మంది అభ్యర్థులలో చాలా మందికి మూడంకెల స్కోరు కూడా దాటలేదు. మరికొందరికైతే 100 లోపు ఓట్లే పడ్డాయి. వేణుగోపాలకృష్ణకు 1017 ఓట్లు, హేమ కుమారికి 956, వానపల్లి శివ గణేష్ 772, అసన్ షరీఫ్ 759, బండారు రామ్మోహన్ 709, చిక్కాల దుర్గాప్రసాద్ 665, కాట్రు నాగబాబు 565 ఇలా చాలా మంది అభ్యర్థులు 1000 మార్క్ కూడా టచ్ చేయలేకపోయారు.
Similar News
News October 25, 2025
SRCL: ‘కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించాలి’

ఈ ఖరీఫ్ సీజన్లో వరి ధాన్యం, పత్తి, మక్కలు ఇతర పంటల కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగాలని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. ఆయా పంటల ఉత్పత్తుల సేకరణ, చేయాలిసిన ఏర్పాట్లు తదితర అంశాలపై పౌరసరఫరాల శాఖ, సహకార శాఖ, ఐకేపీ, మెప్మా, డీసీఎంఎస్ తదితర అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయంలో ఇన్చార్జి కలెక్టర్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
News October 25, 2025
WGL: ఐఐఎస్సీ ప్రొఫెసర్ మాధవిలత ఎవరో తెలుసా..?

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన బెంగళూరు ఐఐఎస్సీ ప్రొఫెసర్ డా.జి. మాధవీలతా వరంగల్ ఎన్ఐటీ సాంకేతిక ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆమె, జియోటెక్నికల్ ఇంజినీరింగ్లో నిపుణురాలు, చీనాబ్ వంతెనకు భూగర్భ సాంకేతిక సలహాదారుగా 17 ఏళ్లపాటు సేవలు అందించి దేశ గౌరవాన్ని పెంచారు. ఆమె నిట్లో విద్యార్థులకు దిశా నిర్దేశం చేయడం పట్ల జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
News October 25, 2025
కర్నూలు ఘోర ప్రమాదంలో ‘కడప జిల్లా వాసి ముృత్యుంజయుడు’

కర్నూలు ప్రమాదంలో 20 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. ఆ ఘటనలో పెద్దముడియంలోని నెమళ్లదిన్నెకు చెందిన జయసూర్య మృత్యుంజయుడయ్యాడు. 25 ఏళ్ల కిందట బతుకుదెరువు కోసం తల్లిదండ్రులు హైదరాబాద్లో సెటిలయ్యారు. బీటెక్ పూర్తి చేసిన జయసూర్య బెంగళూరులో ఇంటర్వ్యూకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో అద్దాన్ని పగులకొట్టి దూకి ప్రాణాలుకాపాడుకున్నాడు. కాగా రెండు కాళ్లు విరిగినట్లు తెలిపాడు.


