News March 4, 2025

కోనసీమ: MLCగా గెలిచిన రాజశేఖరం నేపథ్యం ఇదే..!

image

ఉభయగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన పేరాబత్తుల రాజశేఖరం స్వగ్రామం కోనసీమ జిల్లాలోని జి.వేమవరం. తొలుత ఆయన కాంగ్రెస్ ఎంపీటీసీగా, అనంతరం టీడీపీ నుంచి ఎంపీపీ, జడ్పీటీసీగా పనిచేశారు. ఆక్వా వ్యాపారం చేసే రాజశేఖరం ప్రస్తుతం కాకినాడలో నివాసం ఉంటున్నారు. డిగ్రీ పూర్తిచేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న రాజశేఖరానికి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వరించింది.

Similar News

News December 9, 2025

ఇంటి గుమ్మాన్ని ఎందుకు పూజించాలి?

image

గడపను ద్వార లక్ష్మిగా పూజిస్తే కుటుంబ శ్రేయస్సు కలుగుతుంది. ఇది దేవతలను ఆహ్వానించే ప్రదేశం కాబట్టి వారి అనుగ్రహం లభిస్తుంది. సిరిసంపదలతో పాటు, పెళ్లికాని వారికి మంచి భాగస్వామి దొరుకుతారు. ఇంట్లో ఉన్న కోర్టు సమస్యలు, ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. సొంత ఇంటి కల నెరవేరాలంటే యజమాని ఈ ద్వారలక్ష్మి పూజ చేయాలని పండితులు సూచిస్తున్నారు. గడప పూజ కుటుంబానికి రక్షణ కవచంలా పనిచేస్తుందని అంటున్నారు.

News December 9, 2025

ఎంచివేస్తే, ఆరిక తరుగుతుందా?

image

కొందరు తమ దగ్గర ఉన్న సంపదను పదే పదే లెక్కబెడుతూ ఉంటారు. దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. నిరంతరం ఆ ధ్యాసలోనే బతుకుతారు. అయితే మన దగ్గర ఉన్న సంపద లేదా ధాన్యాన్ని ఎన్నిసార్లు లెక్కపెట్టినా అవి పెరిగిపోవు, తరగిపోవు. అవి మొదట ఎంత ఉన్నాయో, ఎన్నిసార్లు లెక్కించినా అంతే ఉంటాయి. వాటి గురించి పదే పదే ఆలోచన తగదు అని చెప్పే సందర్భంలో ఈ సామెత వాడతారు.

News December 9, 2025

రేపటి నుంచి TET.. పకడ్బందీ ఏర్పాట్లు

image

AP: ఈ నెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు టెట్ (Teacher Eligibility Test) పరీక్షలు జరగనున్నాయి. ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ఈ పరీక్షల కోసం ఇప్పటికే పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. అభ్యర్థులు పరీక్షకు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని, హాల్ టికెట్‌తో పాటు ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు సూచించారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదన్నారు. రోజూ 2 విడతలుగా పరీక్షలు జరుగుతాయి.