News October 11, 2024

కోమటి చెరువుపై బతుకమ్మ వేడుకలు.. హరీష్ రావుతో సెల్ఫీలు

image

సద్దుల బతుకమ్మ సందర్భంగా సిద్దిపేటలోని కోమటి చెరువుపై గురువారం రాత్రి బతుకమ్మ వేడుకలు ఘనంగా కొనసాగాయి. రంగురంగుల పూలతో విభిన్న ఆకృతుల్లో బతుకమ్మలను ఆడపడుచులు పేర్చి ఒకచోట చేర్చి ఆటపాటలు ఆడుతూ సందడి చేశారు .స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని తిలకించారు. ఆడపడుచులు హరీష్ రావుతో సెల్ఫీలు దిగాలని తాపత్రయపడగా స్వయంగా హరీష్ రావే సెల్ఫీ ఫోటోలు క్లిక్ మనిపించారు.

Similar News

News November 11, 2024

మెదక్: దహన సంస్కారాలలో అడుక్కోడానికి స్కానర్

image

డిజిటల్ వినియోగం పెరిగిపోయిన నేపథ్యంలో దహన సంస్కారాల సమయంలో అడుక్కోవడానికి స్కానర్ ఉపయోగించడం ఆశ్చర్యానికి గురిచేసింది. మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్ పల్లి గ్రామానికి చెందిన బాలమణి నిన్న మృతిచెందగా ఈరోజు దహన సంస్కారం నిర్వహించారు. దహన సంస్కారాల వద్ద అడుక్కోవడానికి వచ్చిన కాటిపాపల మహేశ్ ఏకంగా షర్టుకు ఫోన్ పే స్కానర్ తగిలించి అడుక్కోవడం వింతగా చూశారు.

News November 11, 2024

నేడు ఉమ్మడి మెదక్ జిమ్నాస్టిక్ ఎంపికలు

image

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో ఈనెల 12న కొల్లూరులోని గార్డియన్ స్కూల్లో ఉమ్మడి జిల్లా జిమ్నాస్టిక్ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అమూల్యమ్మ ఆదివారం తెలిపారు. అండర్ 14, 17 బాలుర, బాలికలు ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఒరిజినల్ బోనాఫైడ్ సర్టిఫికేట్‌తో ఉదయం 9 గంటల వరకు హాజరు కావాలని కోరారు.

News November 10, 2024

సిద్దిపేట విషాద ఘటనకు కారణమిదే!

image

సిద్దిపేట చింతలచెరువులో తండ్రి తన ఇద్దరు పిల్లలతో దూకి <<14574531>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. తేలు సత్యం రెండో భార్య శిరీషతో గొడవ కారణంగా కొంతకాలంగా దూరంగా ఉంటున్నాడు. దీంతో మనస్తాపం చెందిన సత్యం తన ఇద్దరి పిల్లలు కొడుకు అన్వేశ్(7) కూతురు త్రివేణి(5) కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.