News January 23, 2025
కోమాట్లగూడెం: నేడు మళ్లీ కమ్ముకున్న పొగమంచు

గంగారాం మండలం కోమట్లగూడెం గ్రామంలో ఉదయం పొగమంచు కమ్ముకుంది. దీంతో ప్రధాన రహదారులపై వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు పొలం పనులు, ఇతర పనులకు వెళ్లలేక పోతున్నారు.
Similar News
News November 13, 2025
NRPT: ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేయాలి

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేయాలని రాష్ట్ర అల్ మేవ అధ్యక్షుడు షేక్ ఫరూక్ హుస్సేన్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం నారాయణపేట మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం ఏజెన్సీ ద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేసి అనేక అక్రమాలకు పాల్పడిందని విమర్శించారు. మైనారిటీ పాఠశాల, కళాశాలలో నియామకాలను కార్పొరేషన్ ద్వారా చేపట్టాలని కోరారు.
News November 13, 2025
10 రోజుల్లో పీఎఫ్ సమస్యలు పరిష్కరించాలి: APTF

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులు, ప్రదానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారుల పీఎఫ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ విజ్ఞప్తి చేసింది. ఇదే అంశంపై జిల్లా అధ్యక్ష, కార్యదర్శి బసవలింగారావు, ఖాలీద్ గురువారం జడ్పీ ఛైర్పర్సన్ క్రిస్టీనాను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. 10 రోజుల్లో సమస్య పరిష్కారం చేయకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
News November 13, 2025
ప్రొద్దుటూరులో రేషన్ మాఫియా..!

ప్రొద్దుటూరులో రేషన్ మాఫియా విజృంభిస్తోంది. వాళ్ల దెబ్బకు అధికారులు సైతం హడలి పోతున్నారు. ఇటీవల రేషన్ బియ్యం తరలిస్తుండగా 1టౌన్, 3టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ప్రొద్దుటూరు మండలంలో 143 రేషన్ షాపులున్నాయి. వీటి పరిధిలో 68,675 రేషన్ కార్డులున్నాయి. నవంబర్ నెలకు 9,839 క్వింటాళ్ల బియ్యం, 648 క్వింటాళ్ల చక్కెర, 1,427 క్వింటాళ్ల జొన్నలు వచ్చాయి. వీటిలో ఎక్కువ భాగం పక్కదారి పట్టాయని సమాచారం.


