News January 4, 2025

కోరిక తీర్చనందుకే మహిళ హత్య: కావలి DSP

image

కావలిలో ఈ నెల ఒకటో తేదీన అర్పిత బిస్వాస్ అనే మహిళను హత్య చేసిన నౌమౌన్ బిస్వాస్‌ను అరెస్ట్ చేసినట్లు DSP శ్రీధర్ తెలిపారు. అర్పితను అనుభవించాలనే కోరికతో నిందితుడు ఆమె భర్త శ్రీకాంత్‌తో కలిసి మందు తాగాడు. శ్రీకాంత్ మత్తులోకి జారుకున్నాక.. పక్క గదిలో నిద్రిస్తున్న అర్పితపై లౌంగిక దాడికి యత్నించాడు. ఆమె అడ్డుకోవడంతో రాడ్డుతో కొట్టి చంపాడు. అనంతరం చనిపోయిన అర్పితను అత్యాచారం చేసినట్లు ఆయన తెలిపారు. 

Similar News

News October 24, 2025

రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు, కాలేజీలు

image

నెల్లూరు జిల్లాలో శుక్రవారం పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీలు తెరుచుకుంటాయని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో రెండు రోజులుగా సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. వర్షాలు తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ కోరారు.

News October 23, 2025

నెల్లూరు: ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

పల్లిపాడులోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలో ఖాళీల భర్తీకి DEO డా.ఆర్ బాలాజీ రావు నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లాలో 5 సం.లు అనుభవం కలిగిన స్కూల్ అసిస్టెంట్లు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సీనియర్, జూనియర్ లెక్చర్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్, తెలుగు, ఫిజిక్స్, ఫైన్ ఆర్ట్స్, ఇంగ్లిష్, సీనియర్, జూనియర్ లెక్చరర్ ఇన్ ఈవీఎస్, సోషల్ పోస్టులకు గాను గూగుల్ ఫామ్ ద్వారా ఈనెల 29వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.