News January 4, 2025
కోరిక తీర్చనందుకే మహిళ హత్య: కావలి DSP
కావలిలో ఈ నెల ఒకటో తేదీన అర్పిత బిస్వాస్ అనే మహిళను హత్య చేసిన నౌమౌన్ బిస్వాస్‌ను అరెస్ట్ చేసినట్లు DSP శ్రీధర్ తెలిపారు. అర్పితను అనుభవించాలనే కోరికతో నిందితుడు ఆమె భర్త శ్రీకాంత్‌తో కలిసి మందు తాగాడు. శ్రీకాంత్ మత్తులోకి జారుకున్నాక.. పక్క గదిలో నిద్రిస్తున్న అర్పితపై లౌంగిక దాడికి యత్నించాడు. ఆమె అడ్డుకోవడంతో రాడ్డుతో కొట్టి చంపాడు. అనంతరం చనిపోయిన అర్పితను అత్యాచారం చేసినట్లు ఆయన తెలిపారు.
Similar News
News January 25, 2025
విద్యార్థులకు బహుమతులు అందజేసిన నగర కమిషనర్
జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీన 117 నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు మోడల్ స్కూల్ ప్రాంగణంలో క్విజ్, ఎస్సే రైటింగ్ , వక్తృత్వ పోటీలను నిర్వహించారు. అందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులను కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కమిషనర్ విద్యార్దులను అభినందించారు. అనంతరం బహుమతులను అందజేశారు.
News January 24, 2025
ఉదయగిరి: హైస్కూల్ సమీపంలో కొండచిలువ హల్‌చల్
ఉదయగిరి మండలం బిజంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. కొండ చిలువ వరి కోత మిషన్‌లో ఇరుక్కుని పోయి ఉండగా రైతులు గమనించి చంపేశారు. సమీపంలోనే పాఠశాల ఉండడం విద్యార్థులు తరచుగా అటు ఇటు సంచరిస్తున్న నేపథ్యంలో ప్రహరీ గోడ ఎత్తు పెంచాలని గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
News January 24, 2025
గూడూరుకు నేడు జిల్లా కలెక్టర్ రాక
శుక్రవారం తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ రేపు గూడూరు డివిజన్ కు రానున్నారు. చిల్లకూరు సాగరమాల జాతీయ రహదారి package-4 నిర్మాణ పనులు పరిశీలించుటకు రానున్నట్లు తెలుస్తోంది. సాగరమాల జాతీయ రహదారి నిర్మాణ పనులు ఇప్పటివరకు ఎంతమేరకు జరిగాయి అన్న వివరాలు తెలుసుకునేందుకు రానున్నట్లు తెలుస్తోంది.