News March 11, 2025

కోరుకొండ: ఆకట్టుకుంటున్న నరసింహుడి గిరి

image

రాజానగరం నియోజకవర్గ మండలం ప్రధాన కేంద్రమైన కోరుకొండలోని శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో వైకుంట ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాత్రి పూట విద్యుత్ దీపా అలంకరణ భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా భక్తులు ఈ గిరి ఎక్కి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.

Similar News

News March 27, 2025

రాజమండ్రి : వెంటిలేటర్‌పై అంజలి

image

రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నం చేసుకున్న అంజలి వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతోంది. దీనికి ఏజీఎం దీపకే కారణమని విద్యార్థిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ప్రకాశ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడి కుటుంబీకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఆరోగ్యంలో ఏమాత్రం మెరుగులేదని వైద్యులు తెలిపారు. కాగా ఆమె తల్లిదండ్రులు తమ కూతురు బతికి వస్తుందని, రావాలని ఆశతో ఎదురుచూస్తున్నారు.

News March 27, 2025

గోదావరిలోకి దూకేసిన యువకుని మృతదేహం లభ్యం

image

ఏమైందో.. ఏమో గాని రాజానగరం కొత్త కాలనీకి చెందిన మునసా వీరబాబు (19) బుధవారం సాయంత్రం రాజమండ్రి గోదావరిలోకి దూకేశాడు. స్నేహితుడు వెంకీతో కలిసి బైక్‌పై రంపచోడవరం వెళ్లి తిరిగి వచ్చిన వీరబాబు రోడ్ కం రైల్వే బ్రిడ్జి మీదకి చేరుకుని, సెల్ ఫోన్‌ను స్నేహితునికి ఇచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెంకి ద్వారా సమాచారం అందుకున్న రాజమండ్రి పోలీసులు గల్లంతైన వీరబాబు మృతదేహాన్ని వెలికితీశారు.

News March 27, 2025

తానేటి వనితకు వైసీపీ అదిష్ఠానం మరో బాధ్యత

image

రాష్ట్ర మాజీ హోంమంత్రి, గోపాలపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ తానేటి వనితకు వైసీపీ అదిష్ఠానం మరో బాధ్యతను అప్పగించింది. ‘పార్టీ క్రమ శిక్షణ కమిటీ’లో సభ్యురాలిగా ఆమెను నియమిస్తూ బుధవారం వైసీపీ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీలో శెట్టిపల్లి రఘురామి రెడ్డి, రెడ్డి శాంతి, కైలే అనీల్ కుమార్, విశ్వేశ్వర రెడ్డిలు ఉన్నారు.

error: Content is protected !!