News February 7, 2025
కోరుట్ల ఆర్డీవో కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేసిన కలెక్టర్

జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్డీవో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ శుక్రవారం తనిఖీ చేశారు. ఎన్ హెచ్- 63 రోడ్డు కోసం సేకరించిన భూముల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ రికార్డులను పరిశీలించి ఏ గ్రామంలో ఎంత భూమి కోల్పోతున్నారనే విషయాలపై చర్చించారు. ఆయన వెంట కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహశీల్దార్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.
Similar News
News October 28, 2025
మొంథా తుఫాను.. ఈ జిల్లాల్లో రాకపోకలు బంద్

AP: మొంథా తుఫాను నేపథ్యంలో కృష్ణా, ఏలూరు, తూ.గో., ప.గో., అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాలోని చింతూరు, రంపచోడవరం డివిజన్లలో రాకపోకలను నిషేధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈరోజు రాత్రి 8PM నుంచి రేపు 6AM వరకు ఈ జిల్లాల్లోని నేషనల్ హైవేలతో పాటు అన్ని రోడ్లపై వాహనాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కేవలం మెడికల్ సర్వీసులకు మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరించారు.
News October 28, 2025
తూ.గో: సార్.. ఈ సమస్యలను పరిష్కరించండి

తుఫాన్ నేపథ్యంలో ఉమ్మడి తూ.గో జిల్లా ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. చాలా ఏరియాల్లో మంగళవారం ఉదయం నుంచి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ‘మీ ఏరియాలో కరెంట్ ఉందా? లేదా?’ అంటూ Way2Newsలో ప్రచురితమైన వార్త కింద <<18131522>>కామెంట్ల <<>>రూపంలో ప్రజలు తమ సమస్యలను వివరించారు. వీటిపై ఆయా ప్రాంతాల అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
News October 28, 2025
మొంథా తుపాన్.. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఎర్ర హెచ్చరిక!

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ తీవ్ర వాయుగుండంగా బలపడింది. తుపానుగా మారి గంటకు 90 నుంచి 110 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లికి రెడ్ అలెర్ట్ జారీ కాగా.. వరంగల్ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అతి భారీ వర్షాలతో మొక్కజొన్న, పత్తి పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు సూచించారు.


