News February 7, 2025
కోరుట్ల ఆర్డీవో కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేసిన కలెక్టర్

జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్డీవో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ శుక్రవారం తనిఖీ చేశారు. ఎన్ హెచ్- 63 రోడ్డు కోసం సేకరించిన భూముల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ రికార్డులను పరిశీలించి ఏ గ్రామంలో ఎంత భూమి కోల్పోతున్నారనే విషయాలపై చర్చించారు. ఆయన వెంట కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహశీల్దార్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.
Similar News
News April 18, 2026
తండ్రయిన రషీద్ ఖాన్

అఫ్గాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తండ్రయ్యారు. తన భార్య మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. చిన్నారికి అజ్లాన్ ఖాన్ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. రషీద్ ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే.
News April 18, 2026
సూర్యాపేట: ‘టి-హబ్ సేవలను మరింత బలోపేతం చేయాలి’

సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధ్యక్షతన టి-హబ్ సేవలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నిత్యం 1500 మందికి పైగా రోగులకు సుమారు 5500 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రక్త పరీక్షల్లో నాణ్యత, ఖచ్చితమైన ఫలితాలు వచ్చేలా పర్యవేక్షణ పెంచాలని అధికారులను ఆదేశించారు. నమూనాల తిరస్కరణపై నివేదిక కోరడంతో పాటు, మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
News April 18, 2026
కామారెడ్డి: సప్త ప్రాకారాల సిద్ధిరామేశ్వరాలయం

భిక్కనూర్‌లోని సిద్ధిరామేశ్వర ఆలయానికి సప్తప్రాకారాల ఆలయంగా పేరు ఉంది. కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయంగా చెబుతారు. ఈ ఆలయానికి ఏడు వరసల గోడలు ఉండటం వల్ల ఈ పేరు వచ్చిందని, శత్రువుల దాడి నుంచి కాపాడటానికి ఈ నిర్మాణం చేశారని స్థానికులు చెబుతారు. ఆలయ ప్రవేశ ద్వారాలు, స్తంభాలపై కాకతీయుల శిల్పకళా ముద్రలు కనిపిస్తాయి. సుమారు 800 సం.రాల క్రితం నిర్మించారని చరిత్రకారులు భావిస్తారు.
#WORLD HERITAG SPECIAL


