News August 12, 2024
కోరుట్ల: స్కాలర్షిప్లు విడుదల చేయాలని సీఎంకు పోస్ట్ కార్డులు
స్కాలర్షిప్లు విడుదల చేయాలని కోరుట్ల డిగ్రీ కళాశాల విద్యార్థులు సీఎంకు పోస్ట్ కార్డు ద్వారా విన్నవించారు. మూడేళ్లుగా స్కాలర్షిప్లు రాకపోవడం వల్ల పరీక్ష ఫీజులు చెల్లించడానికి, పుస్తకాలు కొనుక్కోవడానికి ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. బస్ పాసుల కోసం డబ్బులు లేక కళాశాలకు రెగ్యులర్గా రాలేక చాలా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా స్కాలర్షిప్ను విడుదల చేయాలని కోరారు.
Similar News
News November 27, 2024
సోలార్ విద్యుత్ పొదుపునకు వినూత్న ఆవిష్కరణ
సోలార్ విద్యుత్ సద్వినియోగం, పొదుపు చర్యలలో భాగంగా సింగరేణి సంస్థ మరో వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. మందమర్రి సోలార్ ప్లాంట్లో పగటిపూట ఉత్పత్తి జరిగి, వినియోగం తర్వాత ఇంకా మిగిలిన సోలార్ విద్యుత్ను వృథాగా పోనీయకుండా బ్యాటరీలో నిల్వ చేసే ‘బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం’ ను పైలెట్ ప్రాజెక్ట్గా ఏర్పాటు చేస్తోందని సంస్థ C&MD బలరాం ప్రకటనలో తెలిపారు.
News November 27, 2024
కరీంనగర్ రీజియన్లో 104 ఆర్టీసీ డ్రైవర్ పోస్టులు
మాజీ సైనికులను RTC డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఈ మేరకు కరీంనగర్ రీజియన్లో 104 పోస్టులు కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి.అర్హులైనవారు ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. ఎంపికైన వారికి నెలకు రూ.26 వేల జీతంతో పాటు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.
News November 27, 2024
ఇబ్రహీంపట్నం: పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. ఎస్సై అనిల్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పుప్పాల రమ్య (19)కు కొంత కాలంగా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆమెకు పెళ్లి ఇష్టం లేక ఇంటి ఆవరణలో గల షెడ్డులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రమ్య తండ్రి చిన్నయ్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.