News January 10, 2025

కోర్టుకు హాజరుకాని మంత్రి కొండా సురేఖ.. కేసు వాయిదా

image

మంత్రి కొండా సురేఖపై అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసును స్పెషల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఈనెల 16కు వాయిదా వేశారు. ఇదివరకే విచారణ చేపట్టిన కోర్టు పిటిషనర్‌తో పాటు సాక్షుల వాగ్మూలం రికార్డు చేసి మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. అయితే మంత్రి ప్రభుత్వ కార్యకలాపాల కారణంగానే కోర్టుకు హాజరుకాలేదని న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో విచారణను వాయిదా వేశారు.

Similar News

News January 10, 2025

HYD: 4 నెలల్లో దుర్గం చెరువు FTL గుర్తింపు

image

4 నెల‌ల్లో దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్ గుర్తించేందుకు హైడ్రా సన్నాహకలు చేస్తుంది. ఎఫ్‌టీఎల్ నిర్ధార‌ణ‌లో సంబంధిత ప్ర‌భుత్వ శాఖ‌ల‌తో పాటు.. ఐఐటీ, బిట్స్‌పిలానీ, జేఎన్‌టీయూ సహకారం చెయ్యనుంది. ఎన్‌ఆర్‌ఎస్‌సీ శాటిలైట్ ఇమేజీల‌ను, స‌ర్వే ఆఫ్ ఇండియా రికార్డుల‌ను అధ్య‌య‌నం చేసిన త‌ర్వాత తుది నివేదిక‌ సిద్ధం చెయ్యనుంది.

News January 10, 2025

HYD: బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతలు వీరే..!

image

గచ్చిబౌలిలోని  పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో 7రోజుల పాటు జరిగిన ఆల్ ఇండియా జూనియర్ అండర్ 19 ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుక్రవారం ముగిసింది. ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో కొలగట్ల వెన్నెల, వలిశెట్టి శ్రేయాన్షి 21-15, 21-16తో తారిని, రేషికపై విజయం సాధించారు. సింగిల్స్‌లో రౌనక్ చౌహాన్ 21-16, 21-13 స్కోర్‌తో ప్రణవ్ రామ్ రన్నరప్‌గా నిలిచాడు.

News January 10, 2025

HYD: 2030 నాటికి 10వేల ఛార్జింగ్ స్టేషన్లు..50% అక్కడే!

image

2030 నాటికి 10వేల EV ఛార్జింగ్ స్టేషన్లను తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా వీటికోసం ప్రణాళికలు సిద్ధం చేయగా, దాదాపు 50% హైదరాబాద్ మహానగరంలోనే ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. 2024 నవంబర్ నెలలో నూతనంగా తెచ్చిన ఈవీ పాలసీ మేలు చేయనుంది. మరోవైపు HYD నగరంలో మొత్తం ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సులను తేవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.