News December 13, 2024

కోర్టులో పేర్నినాని సతీమణి బెయిల్ పిటిషన్

image

సివిల్ సప్లయ్ గోదాంలో బియ్యం అవకతవకలపై పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదైన సంగతి విదితమే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆమె కోర్టుని ఆశ్రయించారు. కాగా తప్పు చేస్తే ఎంతటి వారినైనా కర్మ వదిలి పెట్టదని జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాసులు విమర్శించారు.  పెదపట్నంలో కబ్జా చేసిన 100ఎకరాల మడ అడవుల విషయంలో కూడా పేర్ని నాని శిక్షార్హుడే అన్నారు. అయితే పేర్ని కుటుంబం అజ్ఙాతంలో ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News January 22, 2025

VJA: 24 నుంచి జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలు

image

విజయవాడ పటమటలోని జిల్లాపరిషత్ బాలుర పాఠశాలలో ఈ నెల 24 నుంచి 27 వరకు జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన వివరాలను DRO ఎం.లక్ష్మీనరసింహారావు మంగళవారం విజయవాడలోని తన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ పోటీల్లో 5 రాష్ట్రాల నుంచి బాలబాలికల జట్లు పాల్గొంటున్నాయన్నారు. పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని లక్ష్మీనరసింహారావు వివరించారు.

News January 21, 2025

వీరులపాడు: బైక్ అదుపు తప్పి యువకుడు మృతి

image

వీరులపాడు మండల పరిధిలోని వెల్లంకి గ్రామంలో సోమవారం రాత్రి ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు అదే గ్రామానికి చెందిన కంచె సంతోష్ మెహతాగా గుర్తించారు. తమకు అండగా ఆసరాగా ఉంటాడనే కొడుకు మృతి చెందడం పట్ల తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 21, 2025

పమిడిముక్కల: రోడ్డు ప్రమాదంలో స్నేహితుల మృతి

image

పమిడిముక్కలలో నిన్న జరిగిన ప్రమాదంలో కాకినాడ జిల్లాకు చెందిన దాసరి నిమ్స్ చంద్రం(23), ముక్త దుర్గ బాబు(24)లు మృతి చెందిన విషయం తెలిసిందే. నిమ్స్‌చంద్ర తండ్రి ఆటో డ్రైవర్, తల్లి అంగన్ వాడీ కార్యకర్త. కిర్లంపూడికి చెందిన ముక్తదుర్గసాయి తమ్ముడు 10 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. పెద్ద కుమారుడి మరణంతో తల్లిదండ్రులు ముత్తా పెద్దకాపు, సరస్వతిల విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.