News September 10, 2024
కోర్టులో లొంగిపోయిన నెల్లూరు మేయర్ భర్త

నెల్లూరు కార్పొరేషన్లో జరిగిన సంతకాల ఫోర్జరీ అభియోగం కేసులో మేయర్ భర్త జయవర్ధన్ నిందితుడిగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా పోలీసులు జయవర్ధన్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో టౌన్ ప్లానింగ్ అధికారులను అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. కీలక నిందితుడిగా జయవర్ధన్ మంగళవారం కోర్టులో లొంగిపోయారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
Similar News
News December 3, 2025
Way2News ఎఫెక్ట్.. స్పందించిన కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ కల్లూరుపల్లి హోసింగ్ బోర్డు కాలనీలో గంజాయి ముఠా దాడిలో మృతి చెందిన పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోలేరా అనే శీర్షికన Way2Newsలో కథనం ప్రచురితమైంది. దీనిపై రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. పెంచలయ్య బిడ్డలను ఉన్నత చదువులు చదివేందుకు తోడ్పాటు అందజేస్తానని చెప్పారు.
News December 3, 2025
నెల్లూరులో భారీ వర్షం.. నీట మునిగిన కారు

రాత్రి నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈదురు గాలులకు 28వ డివిజన్లోని జీకే కాలనీలో భారీ చెట్టు పడిపోయింది. సమీపంలోని అపార్ట్మెంట్ సెల్లార్లోకి నీళ్లు రావడంతో కార్లు, బైకులు పూర్తిగా మునిగిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ అధికారులతో కలిసి వాటర్ను బయటికి తీయిస్తున్నారు.
News December 3, 2025
నెల్లూరులో టెక్స్టైల్స్ పార్క్ ఏది: లోక్ సభలో వేమిరెడ్డి

నెల్లూరు జిల్లాలో టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేసిందనేది వాస్తవమేనా అని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లోక్ సభలో మంగళవారం ప్రశ్నించారు. ప్రాజెక్టు వ్యయం రూ.103 కోట్లతో 10 యూనిట్లను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ఏమయ్యాయని అడిగారు. దీనికి కేంద్ర జౌళిశాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరెట్ సమాధానమిస్తూ ప్రభుత్వం 2015లో ప్రకటించిందని, త్వరలో పూర్తి చేస్తామని, రూ.20 కోట్లు విడుదల చేశామని తెలిపారు.


