News October 1, 2024

కోర్టు కేసులపై అధికారులు స్పందించాలి: కలెక్టర్ ఆనంద్

image

ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కోర్టు కేసులపై జిల్లా అధికారులు స్పందించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 35 అర్జీలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

Similar News

News February 25, 2026

నెల్లూరు: రెండో రోజు 899 మంది ఆబ్సెంట్.!

image

నెల్లూరు జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం రెండో రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడ మాల్ ప్రాక్టీసింగ్‌కు తావు లేకుండా పరీక్ష జరిగినట్లు ఆర్ఐవో వరప్రసాద్ రావు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 81 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు 27,790 మంది విద్యార్థులకు గాను 26,891 మంది హాజరయ్యారని 899 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.

News February 25, 2026

ఆ భూములను కాపాడండి: అసెంబ్లీలో సోమిరెడ్డి

image

సర్వేపల్లిలో హైవే పక్కన రూ.100కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని MLA సోమిరెడ్డి కోరారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘సర్వేపల్లిలో గత ఐదేళ్లు చాలా ఘోరాలు జరిగాయి. MSME పార్కు పేరుతో 50 ఎకరాలు, సూరాయపాలెంలో 30 ఎకరాలు, కొమ్మలపూడిలో 19 ఎకరాల భూమిలో స్కామ్ జరిగింది. దీనిపై ఏమైనా చర్యలు మొదలె పెడితే కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంటున్నారు. దీనిపై రెవెన్యూ మంత్రి సమీక్ష చేయాలి’ అని ఆయన విన్నవించారు.

News February 25, 2026

రేపే నెల్లూరుకు జగన్.. టైమింగ్స్ ఇవే!

image

మాజీ సీఎం జగన్ నెల్లూరులో గురువారం పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు పులివెందుల నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి నెల్లూరు రూరల్ కనుపర్తిపాడు జడ్పీ హైస్కూల్లోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10.10 గంటలకు రోడ్డు మార్గం ద్వారా గొలగమూడి రోడ్డులోని VPR కన్వెన్షన్ హాలుకు వస్తారు. అక్కడ వివాహ వేడుకల్లో పాల్గొని 10.45 గంటలకు బెంగళూరు వెళ్తారు.