News March 6, 2025
కోర్టు మెట్లు ఎక్కకూడదు :వరంగల్ న్యాయమూర్తి

కుటుంబం, సమాజంలోని వ్యక్తుల మధ్య వచ్చే వివిధ తగాదాలను పరిష్కరించే ప్రయత్నం సామాజికవర్గ స్థాయిలోనే జరగాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలా గీతాంబ అన్నారు. అది కుటుంబానికి మరియు సమాజానికి మేలు చేస్తుందని పేర్కొన్నారు. వివాదాలను పోలీస్ స్టేషన్, కోర్టుల దాకా తీసుకువెళ్తే వ్యక్తుల మధ్య సంబంధాలు దెబ్బతింటాయన్నారు. ఇది సమాజానికి హానికరం అని చెప్పారు.
Similar News
News November 15, 2025
వయోవృద్ధులను గౌరవిద్దాం: WGL కలెక్టర్

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తా నుంచి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వరకు వయోవృద్ధుల వాకథాన్(ర్యాలీ) జరిగింది. కలెక్టర్ సత్య శారద ముఖ్యఅతిథిగా పాల్గొని, జెండా ఊపి ప్రారంభించారు. ఈనెల 19 వరకు జిల్లాలో వారోత్సవాలను నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు.
News November 15, 2025
NZB: పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి: సుదర్శన్ రెడ్డి

NZB జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల సలహాదారు సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్లో ఆయన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఆర్ఓబీ పనుల పురోగతి అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనులపై చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News November 15, 2025
మచిలీపట్నం GGHలో అవినీతి మరకలు..?

మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రి అవినీతికి అడ్డాగా మారుతోందని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రి ఉద్యోగులు వసూళ్లకు పాల్పడుతున్నారని రోగుల బంధువులు చెబుతున్నారు. ఇదేకాక శిక్షణ పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థుల నుంచి సర్టిఫికేట్లు ఇచ్చే విషయంలో కూడా కొంతమంది వసూళ్లకు పాల్పడుతున్నట్లు వస్తున్న ఆరోపణలు సర్వత్రా విమర్శలకు దారితీస్తున్నాయి.


