News December 18, 2024

కోలుకుంటున్న డోన్ ఎమ్మెల్యే

image

డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు ఆయన వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, త్వరలోనే డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కాగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా నిన్న ఆయన స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. మరోవైపు ఈ విషయం తెలియగానే కోట్ల అనుచరులు ఆందోళనకు గురయ్యారు. త్వరగా కోలుకోవాలంటూ పూజలు చేశారు.

Similar News

News January 22, 2025

‘జాతీయ రహదారులకు భూసేకరణ పూర్తి చేయండి’

image

రాష్ట్రంలోని వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టుల నిర్మాణం, విస్తరణకు అవసరమైన భూ సేకరణను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో పాటు రెవెన్యూ, అటవీ, TR&B, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News January 21, 2025

నంద్యాల: కందులకు రూ.7,550ల మద్దతు ధర

image

రాష్ట్ర ప్రభుత్వం నాఫెడ్‌ ఆధ్వర్యంలో మార్క్‌ఫెడ్ ద్వారా మద్దతు ధర రూ.7,550లతో ఈ క్రాప్ చేయించుకున్న రైతుల నుంచి కందులు కొనుగోలు చేసేందుకు ఆదేశాలు జారీ చేసిందని మార్క్‌ఫెడ్ డీఎం హరినాథ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఒక రైతుకు రోజుకు 40 క్వింటాళ్ల పరిమితిని విధించినట్లు చెప్పారు. బుధవారం నుంచి ప్రతి రైతు సేవ కేంద్రాలలో కందుల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

News January 21, 2025

ఇద్దరు ఐపీఎస్‌ల ప్రేమ వివాహం.. కర్నూలులో పోస్టింగ్..!

image

ఐపీఎస్ భార్యాభర్తలిద్దరూ కర్నూలులో విధులు నిర్వహించనున్నారు. ఎస్పీగా విక్రాంత్ పాటిల్, ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్‌గా ఆయన సతీమణి దీపికను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కాకినాడ ఎస్పీగా విక్రాంత్ పాటిల్, కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్‌గా దీపిక ఉన్నారు. కాగా, తన అన్న స్నేహితుడైన విక్రాంత్ పాటిల్‌తో పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు.