News July 5, 2024
కోల్డ్ స్టోరేజీలలో పేరుకుపోతున్న నిల్వలు

ఖమ్మం జిల్లాలో 42 కోల్డ్ స్టోరేజీలు ఉండగా, సుమారు 45 లక్షల వరకు మిర్చి బస్తాలను నిల్వ చేసే సామర్థ్యం ఉంది. గత ఏడాది వానాకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా 92,273 ఎకరాల్లో మిర్చి సాగు చేసిన రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు. మధిరలోని 13కోల్డ్ స్టోరేజీల్లో సుమారు 12లక్షల బస్తాలు నిల్వ చేసినట్లు అంచనా. కనీసం రెండు లక్షల బస్తాలను కూడా విక్రయించకపోవడంతో 10 లక్షలకు పైగా బస్తాలు నిల్వ ఉన్నాయి.
Similar News
News November 14, 2025
ఖమ్మం: మా పిల్లలు మంచిగా చదువుతున్నారా..?

ఖమ్మం జిల్లాలోని నేడు అన్ని పాఠశాలల్లో పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 1,217ప్రభుత్వ పాఠశాలలు,14 కేజీబీవీలు, రెండు మోడల్ స్కూల్స్ ఉన్నాయి. సుమారు 66వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. సమావేశాలకు హజరయ్యే పేరెంట్స్కి స్కూల్లో బోధన, విద్యార్థుల పట్ల ఎలా మెలగాలి, వారిని ఎలా ప్రోత్సాహించాలనే అంశాలపై అవగాహన కల్పించనున్నారు. అంశాల వారీగా 40నిమిషాల పాటు సమావేశం నిర్వహించనున్నారు.
News November 13, 2025
తల్లి కష్టం చూసి.. గ్రూప్-1 ఉద్యోగం సాధించి..

ఖమ్మం: చిన్న తనం నుంచే తల్లి కండక్టర్గా పడుతున్న కష్టాన్ని చూసి, ఉన్నతస్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో గ్రూప్-1 ఉద్యోగం సాధించిన ధర్మపురి జగదీష్.. ఖమ్మం నూతన ఆర్టీఓగా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. తొలుత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఆయన, ఆ తర్వాత పెద్ద ఆఫీసర్ కావాలనే లక్ష్యంతో పట్టుదలతో చదివి గ్రూప్-1లో విజయం సాధించారు. మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగిన ఆయన తీరు నేటి యువతకు స్ఫూర్తిదాయకం.
News November 13, 2025
ఖమ్మం: 208 స్కూళ్లకు 26 మందే..

విద్యార్థులు క్రీడల్లో రాణించడంలో పీఈటీల పాత్ర ఎంతో కీలకం. అయితే జిల్లాలో వారి కొరత తీవ్రగా వేధిస్తోంది. జిల్లాలోని 208 ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు కేవలం 11 మంది పీడీలు, 15 మంది పీఈటీలు మాత్రమే ఉన్నారు. అంటే మొత్తంగా 26 మందితోనే నెట్టుకొస్తున్నారు. శారీరక వికాసానికి క్రీడలు తప్పనిసరైనా తర్ఫీదు ఇచ్చేవారు లేకపోవడంతో ప్రతిభ ఉన్నా విద్యార్థులు స్వయంగా సిద్ధమవ్వాల్సి వస్తోంది.


