News February 7, 2025

కోళ్ల పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలి: KMR కలెక్టర్

image

మహారాష్ట్ర లాతూర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రబలిస్తున్నందున కామారెడ్డి జిల్లాలోని కోళ్ల పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. కలెక్టరేట్లో పశుసంవర్ధక శాఖ సిబ్బందికి ఏవియన్ ఇన్ ఫ్లూయెంజాపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. కామారెడ్డి జిల్లాకి మహారాష్ట్ర సరిహద్దున ఉన్నందున కోళ్ల పెంపకం దారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

Similar News

News February 7, 2025

ప్రియురాలికి ఎలుకల మందు ఇచ్చిన ఉద్యోగిపై కేసు: సీఐ

image

ప్రియురాలికి ఓ సచివాలయ ఉద్యోగి ఎలుకల ముందు ఇచ్చి ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటన ప్రత్తిపాడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. సచివాలయ ఉద్యోగి ప్రేమ పేరుతో ఓ యువతిని వేధించి ఉద్యోగం వచ్చాక పెళ్లికి నిరాకరించాడు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని ఇంట్లోకి పెళ్లికి ఒప్పుకోవడం లేదని నమ్మబలికి ప్రియురాలికి ఎలుకల ముందు ఇచ్చి ఆత్మహత్యకు ప్రేరేపించాడు. 

News February 7, 2025

ఇది కదా సక్సెస్ అంటే.. రూ.40 లక్షల నుంచి రూ.20 కోట్లకు

image

‘పాతాల్ లోక్’ వెబ్ సిరీస్ పార్ట్ 2 అమెజాన్ ప్రైమ్‌లో అదరగొడుతోంది. ముఖ్యంగా హాథీరామ్ చౌదరి పాత్రలో జైదీప్ అహ్లావత్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. 2020లో రిలీజైన మొదటి పార్ట్‌కు కేవలం రూ.40లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న అతను ఇప్పుడు ఏకంగా రూ.20 కోట్లు అందుకున్నారు. ఈ అంశం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో సక్సెస్ అంటే ఇదేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News February 7, 2025

దొంగలను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు

image

ఏలూరులోని నగల దుకాణంలో భారీ చోరీకి పాల్పడిన<<15384948>> దొంగలను<<>> పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితులు అంతర్‌రాష్ట్ర ముఠాగా గుర్తించిన పోలీసులు వారు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నట్లు తెలిసి అక్కడకు వెళ్లారు. వారి గ్రామాల సమీపంలో మాటు వేసి పట్టుకున్నారు. నిందితులపై ఏలూరు పరిధిలో దాదాపు 10 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి 469 గ్రాముల బంగారు ఆభరణాలు, 41 కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు

error: Content is protected !!